ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ లలో టిక్‌టాక్ స్టార్ల హల్ చల్..

By Sandra Ashok KumarFirst Published Jul 2, 2020, 12:14 PM IST
Highlights

భారతదేశంలో చాలా మంది టిక్‌టాక్ స్టార్లు వారికి ఉన్న ఫేమ్, ఫలవర్స్ కోల్పోకుండా ఉండడానికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వారి అక్కౌంట్ వివరాలను తెలుపుతూ తమని ఫాలో కావాలని కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్  యాప్ పై విధించిన నిషేధంతో టిక్‌టాక్ స్టార్లు ప్రత్యమ్న్యాయంగా ఇన్‌స్టాగ్రామ్‌ పై దృష్టిపెట్టారు. భారతదేశంలో చాలా మంది టిక్‌టాక్ స్టార్లు వారికి ఉన్న ఫేమ్, ఫలవర్స్ కోల్పోకుండా ఉండడానికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వారి అక్కౌంట్ వివరాలను తెలుపుతూ తమని ఫాలో కావాలని కోరుతున్నారు.

టిక్‌టాక్‌ను ఇండియాలో బ్యాన్ చేశాక  చాలా మంది టిక్‌టాక్‌ యూసర్లు, టిక్‌టాక్‌ ఫేమస్ స్టార్లు  తమ ఫలోవర్స్ ని పోగొట్టుకొకుండా ఉండడానికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ పై దృష్టి పెట్టారు ప్రారంభించారు. టిక్‌టాక్ యాప్ ను ఆపిల్  యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు లేకుండా అందులో నుంచి పూర్తిగా తొలగించారు,

అయితే ఈ యాప్ బ్యాన్ కు ముందు ఉన్న వారి ఫోన్‌లలో మాత్రం ప్రస్తుతానికి పనిచేస్తోంది. టిక్‌టాక్  బ్యాన్ తో కొంతమంది టిక్‌టాక్ స్టార్లు వారి ప్లాట్‌ఫారమ్‌ను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ పై  మార్చే పనిలో ఉన్నరు.

అయితే ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయిన  ఇన్‌స్టాగ్రామ్‌ను ఎలా ఉపయోగించాలో వినియోగదారులకు తెలపడానికి వీడియోలను కూడా రూపొందించారు. దీనిపై  చాలా మంది టిక్‌టాక్ వినియోగదారులు తమ ఫలోవర్స్ తో మాట్లాడటానికి ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహిస్తున్నారు.

also read అమెజాన్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ భారీ డీల్... ...

దీంతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ కు క్రేజ్ మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం భారత ప్రభుత్వం టిక్‌టాక్  పై నిషేధాన్ని తెలిపిన వెంటనే వారి ఫాలోవర్స్ ని కోల్పోకుండా ఉండడానికి తమని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫాలో అవ్వమని కోరుతున్నారు.

మరి కొంతమంది టిక్‌టాక్ యూసర్లు అయితే ఇప్పటి నుండి యూట్యూబ్‌లో తమ వీడియోలను చూడమని ఫాలోవర్స్, యూసర్స్ ని అడగడం ప్రారంభించారు. ఫేమస్ టిక్‌టాక్ స్టార్లు కొంతకాలంగా వారి టిక్‌టాక్ ప్రొఫైల్‌లలో వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను అందిస్తున్నారు.  

ప్రభుత్వం టిక్‌టాక్ పై విధించిన నిషేధం టిక్‌టాక్ యూసర్లలో చాలా మందికి మార్పు తెచ్చిపెట్టింది, ఎందుకంటే వారు ఇప్పుడు టిక్‌టాక్ బదులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. 

click me!