అమెజాన్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ భారీ డీల్...

Ashok Kumar   | Asianet News
Published : Jul 01, 2020, 05:52 PM IST
అమెజాన్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ భారీ డీల్...

సారాంశం

 ప్రియాంక చోప్రా  అమెజాన్‌ మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రియాంకా చోప్రాకు ఈ ఒప్పందం మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం. దీనికి సంబంధించి ప్రియాంకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఒప్పందం ద్వారా, ప్రపంచ టెలివిజన్‌కు మరింత దక్షిణాసియా ప్రాతినిధ్యం తీసుకురావాలని నటి లక్ష్యంగా పెట్టుకుంది.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తొలిసారి గ్లోబ‌ల్ టెలివిజ‌న్‌ అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  ప్రియాంక చోప్రా  అమెజాన్‌ మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రియాంకా చోప్రాకు ఈ ఒప్పందం మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం.

దీనికి సంబంధించి ప్రియాంకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఒప్పందం ద్వారా, ప్రపంచ టెలివిజన్‌కు మరింత దక్షిణాసియా ప్రాతినిధ్యం తీసుకురావాలని నటి లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై  ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లో ఇన్నాళ్ళు సినిమా న‌టిగా న‌న్ను ఎంత‌గానో ఆద‌రించారు.

ఇప్పుడు టెలివిజ‌న్‌కి ప‌రిచ‌యం కాబోతున్నాను. అమెజాన్‌తో కుదిరిన ఒప్పందం నాకు సంతోషాన్ని క‌లిగిస్తుంది.  ప్ర‌పంచానికి బ్రాండ్ లాంటి అమెజాన్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం గ‌ర్వంగా ఉంది. కొత్త ప్ర‌య‌త్నానికి ఇది పునాది. హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌లో నేను కంఫ‌ర్ట్‌బుల్‌గా ప‌ని చేయ‌గ‌ల‌ను.

న‌చ్చిన భాష‌లో ఎంతో ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేయ‌గ‌లం అని పేర్కొంది. నా 20 సంవత్సరాల కెరీర్, దాదాపు 60 చిత్రాల తరువాత  తొలిసారి గ్లోబ‌ల్ టెలివిజ‌న్‌ అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం ఇది అని అన్నారు. అంతేకాదు అమెజాన్ టెలివిజన్ ఒప్పందం గ్లోబల్ డీల్ కాబట్టి నేను హిందీ భాష చేయగలను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేయగలను, నాకు నచ్చిన భాష చేయగలను" అని అన్నారు.

also read చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ... ...

ప్రియాంక చోప్రా ఒప్పందం గురించి అమెజాన్ స్టూడియోస్ హెడ్ జెన్నిఫర్ సాల్కే వెరైటీతో మాట్లాడుతూ ప్రియాంకాకు మంచి టాలెంట్ ఉంది. విభిన్న వరల్డ్ స్టోరీల పట్ల మంచి అభిరుచి ఉంది. ప్రియాంకతో మా ఒప్పందం చాలా సంతోషంగా ఉంది.

కంటెంట్ ను చక్కగా ప్రజెంట్ చేయగల సత్తా ఆమెకు ఉందని ఆమెతో మా ప్రయాణం మాకు మరింత ఆనందంగా ఉందని తెలిపారు. "అమెజాన్‌తో కొత్త ఒప్పందం  ప్రియాంకాకు ఇది మూడవ ప్రాజెక్ట్. మొదటిది రియాలిటీ డ్యాన్స్ షో, రెండవది సంగీత్ తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి నిర్మిస్తోంది.

ఇది వారి స్వంత వివాహ సంగీత్ తో ప్రేరణ పొందినట్లు తెలిపింది. ఇందులో వధూవరుల కుటుంబాలు ట్రోఫీ కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతుంటాయి. ఇతర ప్రాజెక్ట్ ఆంథోనీ, జో రస్సో సిటాడెల్ ఇది ఒక గూఢాచారి నాటకం, గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిచర్డ్ మాడెన్‌తో కూడా  ప్రియాంక చోప్రా నటించింది.
 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే