ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన టెలిగ్రామ్.. ఒక నెలలోనే 3 పెద్ద కంపెనీల సర్వీసెస్ డౌన్..

By S Ashok Kumar  |  First Published Dec 17, 2020, 2:01 PM IST

అంతకుముందు గూగుల్ సర్వీసెస్ కూడా అంతరాయం ఏర్పడింది. టెలిగ్రామ్ నిలిచిపోవడానికి సంబంధించి అధికారికంగా ట్వీట్ ద్వారా ధృవీకరించబడినప్పటికీ, షట్ డౌన్ గల కారణాల గురించి టెలిగ్రామ్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.


వాట్సాప్ తర్వాత అతిపెద్ద ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్ కూడా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం నిలిచిపోయింది. అంతకుముందు గూగుల్ సర్వీసెస్ కూడా అంతరాయం ఏర్పడింది.

టెలిగ్రామ్ నిలిచిపోవడానికి సంబంధించి అధికారికంగా ట్వీట్ ద్వారా ధృవీకరించబడినప్పటికీ, షట్ డౌన్ గల కారణాల గురించి టెలిగ్రామ్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. టెలిగ్రామ్ మిడిల్ ఆసియా, యూరప్ వినియోగదారులకు అంతరాయ సమస్యలను కలిగించింది, అయితే ప్రస్తుతం టెలిగ్రామ్ సజావుగా పనిచేస్తుంది.

Latest Videos

undefined

డౌన్‌డెక్టర్ ప్రకారం కేవలం 30 నిమిషాల్లో వేలాది మంది వినియోగదారుల ఫోన్లలో టెలిగ్రామ్ నిలిచిపోయినట్లు ఫిర్యాదు చేశారు. అంతకుముందు డిసెంబర్ 5న కూడా టెలిగ్రామ్ ఆగిపోయింది. డౌన్‌డిటర్ ప్రకారం టెలిగ్రామ్ సుమారు రెండు గంటలు పాటు డౌన్ అయ్యినట్లు తెలిపింది.

also read 

గత వారంలోనే మూడు పెద్ద టెక్ కంపెనీలకు సేవలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్, నెట్‌ఫ్లిక్స్, టెలిగ్రామ్ వంటి మూడు పెద్ద కంపెనీలు వారంలోనే నిలిచిపోవడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 14న యూట్యూబ్ ఇంకా జిమెయిల్‌తో సహా గూగుల్ సేవలు సుమారు 45 నిమిషాలు శాతంభించి పోయాయి.

ఇంటర్నల్ స్టోరేజ్ కారణంగా ఈ సమస్య సంభవించిందని గూగుల్ తరువాత అధికారికంగా పేర్కొంది. డిసెంబర్ 15న నెట్‌ఫ్లిక్స్ కూడా 2 గంటలకు పైగా నిలిచిపోయింది.

 ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులు దీనివల్ల ఎక్కువగా ప్రభావితమయ్యారు. యుఎస్, కెనడా, దక్షిణ అమెరికాతో సహా పలు దేశాలలో నెట్‌ఫ్లిక్స్ సేవ డౌన్ అయ్యీంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సమస్యకు క్షమాపణలు తెలిపింది.

click me!