మురికి నీటిని నిమిషాల్లో శుభ్రం చేసి తాగగలిగేలా చేసే మొబైల్ వాటర్ ప్యూరిఫైయర్ చూసారా..?

By S Ashok KumarFirst Published Dec 17, 2020, 11:13 AM IST
Highlights

మీరు స్కూల్, కాలేజ్ లేదా కార్యాలయం మొదలైన ప్రదేశాలలో ఉన్న నీటి నాణ్యతతో సంతృప్తి చెందకపోతే, ఈ చిన్న సైజు వాటర్ ప్యూరిఫైయర్‌ను మీ వద్ద ఉంచుకోవచ్చు, తద్వారా స్వచ్ఛమైన నీరుని తాగవచ్చు.  ఈ వాటర్ ప్యూరిఫైయర్ పేరు నౌవో. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీరు  నీటిని బాటిల్‌లో ఉంచడం ద్వారా నీటిని శుభ్రం చేసి త్రాగడానికి వీలుగా మారుస్తుంది. 

మీరు తాగుతున్న నీరు శుభ్రంగా ఉన్నాయో లేవో ఈ ప్రశ్న తరచుగా మీ మనస్సులో ఉంటుంది. తాజాగా ఇందుకు పరిశోధకులు ఒక వాటర్ ప్యూరిఫైయర్ ని రూపొందించారు, దీని సహాయంతో మీరు ఎక్కడైనా శుభ్రమైన నీటిని సులభంగా త్రాగవచ్చు.

మీరు స్కూల్, కాలేజ్ లేదా కార్యాలయం మొదలైన ప్రదేశాలలో ఉన్న నీటి నాణ్యతతో సంతృప్తి చెందకపోతే, ఈ చిన్న సైజు వాటర్ ప్యూరిఫైయర్‌ను మీ వద్ద ఉంచుకోవచ్చు, తద్వారా స్వచ్ఛమైన నీరుని తాగవచ్చు.  

ఈ వాటర్ ప్యూరిఫైయర్ పేరు నౌవో. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీరు  నీటిని బాటిల్‌లో ఉంచడం ద్వారా నీటిని శుభ్రం చేసి త్రాగడానికి వీలుగా మారుస్తుంది. మీరు పనిలో లేనప్పుడు మీ వాటర్ బాటిల్ పోయిందని చింతించకండి. మీ బ్యాగ్ నుండి నౌవు వాటర్ ప్యూరిఫైయర్ తీసి బాటిల్‌కు జతచేయండి.

నీటిని శుభ్రం చేయడానికి  ఒక అయస్కాంతం వస్తుంది, ఇది బాటిల్ వెలుపలి భాగంలో అమర్చబడుతుంది. దీనిని ఆక్టివేట్ చేయడానికి, బాటిల్ లో నీటిని నింపడం ద్వారా లైట్లు ఆక్టివ్ గా మారి నీటిని శుభ్రపరుస్తాయి. కొంతసేపటి తర్వాత దీని నుండి బీప్ అని సౌండ్  వినిపిస్తుంది, అంటే నీరు త్రాగడానికి రెడీ అన్నమాట.

also read 

ఈ డివైజ్ తయారు చేయడంలో పూర్తిగా నీటిలో మునిగిన తర్వాత కూడా సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు అయస్కాంత యూ‌ఎస్‌బి కేబుల్ సహాయంతో ఈ డివైజ్ ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి చార్జ్  చేసిన తర్వాత, మీరు దీన్ని ఒక నెల పాటు ఉపయోగించవచ్చు.

నువో వాటర్ ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుంది..?

ఈ డివైజ్ వ్యవస్థాపించిన యువి-సి లైట్ (క్రిమిసంహారక టెక్నాలజి) సహాయంతో బాటిల్ నీటిని ఒక నిమిషంలోలోగా  శుభ్రం చేయడమే కాకుండా, విషపూరిత జెర్మ్స్ వల్ల బాటిల్ వాసన రాకుండా కూడా చేస్తుంది.

మీరు ప్రయాణల సమయంలో నది, జలపాతం, చెరువు నీటిని తాగడానికి ఈ డివైజ్ ఉపయోగించి నీటిని తాగడం కూడా సాధ్యమే. ఈ డివైజ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నీటిలో ఉన్న విషపూరిత జెర్మ్‌లను చంపుతుంది. 

నువో వాటర్ ప్యూరిఫైయర్ మీ వస్తువులను శుభ్రపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సాంప్రదాయ వాటర్ బాటిల్స్, వాటర్ జగ్స్, ఫ్రిజ్ వాటర్ డిస్పెన్సర్‌లలో కూడా నౌవోను ఉపయోగించవచ్చు.

 

click me!