నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌...ప్రముఖ ఐ‌టి కంపెనీలో కొత్తగా 400 ఉద్యోగాలు..

By Sandra Ashok Kumar  |  First Published Jun 19, 2020, 5:27 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న సంక్షోభం దేశంలోని అన్నిరంగాలను తీవ్రమైన దెబ్బ తీసింది. అంతేకాదు ఒకవైపు ఉద్యోగాల కోత, వెతనాల తగ్గింపు కూడా ఆయా సంస్థలు విధించాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 


బెంగుళూరు:  ప్రముఖ టెక్ దిగ్గజం అయిన ఐ‌బి‌ఎం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న సంక్షోభం దేశంలోని అన్నిరంగాలను తీవ్రమైన దెబ్బ తీసింది. అంతేకాదు ఒకవైపు ఉద్యోగాల కోత, వెతనాల తగ్గింపు కూడా ఆయా సంస్థలు విధించాయి.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను టెక్‌ దిగ్గజం ఐ‌బి‌ఎం నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రపంచ అత్యధిక  జనాభా కలిగిన రెండో స్థానంలో భారతదేశం ఉండటంతో ఇతర దేశాల కన్ను ఇండియా పై పడింది.  ప్రపంచ వ్యాప్తంగా ఐ‌బి‌ఎంలో 3,50,00మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో మూడో వంతు భారత్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు.

Latest Videos

undefined

ఐ‌బి‌ఎం మాతృదేశమైన అమెరికాలో కొత్తగా 400 ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు తెలిపింది. ఐ‌బి‌ఎం కంపెనీ తాజాగా ప్రకటనతో ఇండియాలో కంటే తక్కువ నియామకాలు అమెరికాలో చేపట్టడం పట్ల ఆ దేశనికి చెందిన నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

also read పబ్ జి మొబైల్ గేమ్ చైనా దేశానిదా..? అక్కడ ఎందుకు బ్యాన్ చేశారు...

కొత్త నియమకాలను ఐ‌బి‌ఎం మేనేజర్లు, మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు, డేటా సైంటిస్ట్‌లు, నెట్‌వర్క్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌లు తదితర కేటగిరీలలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. 

ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి బోర్‌గియస్‌ మాట్లాడుతూ ఐ‌బి‌ఎం లాంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లోని ఐటీ నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని యూఎస్‌, యూరప్‌లో మాత్రం ఐటీ నిపుణుల కొరత మరింతగా వేదిస్తుందని తెలిపారు.

మరోవైపు కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి దేశీయ ఐటీ నిపుణులు వైపు ఆలోచిస్తున్నట్లు బోర్‌గియస్ పేర్కొన్నారు. తాజాగా మరో ఐ‌టి కంపెనీ  కూడా వర్క్ ఫ్రోం హోం పొడిగిస్తూన్నట్లు ప్రకటించింది. 

click me!