పబ్ జి మొబైల్ గేమ్ చైనా దేశానిదా..? అక్కడ ఎందుకు బ్యాన్ చేశారు...

By Sandra Ashok Kumar  |  First Published Jun 19, 2020, 4:49 PM IST

పబ్ జి ను భారతదేశంలో  క్రికెట్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ అని పిలుస్తారు. కొంతమంది దీన్ని విపరీతంగా ఇష్టపడతారు మరి కొంతమంది వ్యక్తులు దీని గురించే  ఆలోచించారు కాకపోతే ప్రతి ఒక్కరికీ ఈ గేమ్ గురించి తెలుసు. 


చైన దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటు  భారతదేశం అంతటా ప్రజలు నిరసనలు వెల్లడిస్తున్నారు, అయితే తాజాగా భారత దేశ ప్రజాల కన్ను గేమింగ్ ప్రసిద్ది అయిన పబ్ జి మొబైల్ యాప్  పై పడింది. అసలు ఇది ఎ దేశ యాప్ అంటూ దీని గురించి ఆందోళన చెందుతున్నారు.

పబ్ జి ను భారతదేశంలో  క్రికెట్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ అని పిలుస్తారు. కొంతమంది దీన్ని విపరీతంగా ఇష్టపడతారు మరి కొంతమంది వ్యక్తులు దీని గురించే  ఆలోచించారు కాకపోతే ప్రతి ఒక్కరికీ ఈ గేమ్ గురించి తెలుసు. పబ్ జి గేమ్  అనేది ఒక దక్షిణ కొరియా గేమ్ అని చాలా మందికి అభిప్రాయం ఉన్నప్పటికీ, కొందరు ప్రజలు  ఇలాంటి చైనా గేమ్స్ నుండి సంపాదించిన డబ్బును చైనా వారు ఆనందిస్తారు అని నమ్ముతారు. ఒకసారి దాని గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం.

Latest Videos

undefined


గత కొద్ది రోజులుగా చైనా భారతదేశం మధ్య తలెత్తిన విభేధాల వల్ల ఈ సమస్య ప్రారంభమైంది. పాపులర్ ఇంజనీర్, ఎడ్యుకేషన్ రెఫర్మిస్ట్, సోనమ్ వాంగ్చుక్ అనే వ్యక్తి  ఒక వారంలో చైనీస్ సాఫ్ట్‌వేర్‌ను బహిష్కరించెల ప్రజలను ప్రేరేపించారు. గేమర్స్, ముఖ్యంగా మొబైల్ ఫోన్ గేమర్స్, పబ్ జి గేమ్ మొబైల్ వైపు దృష్టి సారించారు అలాగే వారు దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు.


పబ్ జి గేమ్ పబ్లికేషన్ గురించి దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ అయిన బ్లూహోల్ స్టూడియోలో చూడవచ్చు. బ్లూహోల్ స్టూడియో (ప్రస్తుతం క్రాఫ్టన్ గేమ్ యూనియన్ అని పేరు పెట్టారు) పబ్ జి కార్పొరేషన్ హోల్డింగ్ సంస్థ, పబ్ జి గేమ్ ను అభివృద్ధి చేసి పబ్లికేషన్ చేసి ప్రచురించింది.

పబ్ జి గేమ్ వెనుక ఉన్న వ్యక్తి బ్రెండన్ గ్రీన్. ఇతను గ్రీన్ లాండ్ లో జన్మించాడు. జపనీస్ మూవీ "బాటిల్ రాయల్" చూసిన తర్వాత ఆయన ఈ గేమ్ పై ప్రేరణ పొంది తరువాత అతను ఈ గేమ్  అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్ ప్లేయర్‌ అయినందున ప్లేయర్‌ బాటిల్ గ్రౌండ్ (పియుబిజి) పేరును ప్రేరేపించింది. 

అయితే 2017లో చైనాలో పబ్ జి గేమ్ నిషేధించబడినప్పటి నుంచి  ఈ గందరగోళం ప్రారంభమైంది. ఇది చైనాలో పంపిణీ రైట్స్  పొందటానికి చైనా సంస్థ అయిన టెన్సెంట్ హోడింగ్స్ వీడియో గేమ్ పబ్లిషింగ్ యూనిట్ అయిన టెన్సెంట్ గేమ్స్ ను ప్రేరేపించింది.

also read బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు లోన్స్‌.. ఎలా పొందాలంటే..?

ఈ గేమ్ మొబైల్ వెర్షన్‌ను అభివృద్ధి చేయడానికి కూడా ప్లాన్ చేసింది తరువాత పబ్ జి మొబైల్ గేమ్  అందరికీ అందుబాటులోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే అప్పటి వరకు పబ్ జి ఒక వీడియో గేమ్. టెన్సెంట్ గేమ్స్ పబ్ జి గేమ్ మొబైల్ వెర్షన్‌ను తయారు చేసి చైనాలో విడుదల చేసింది.

మీరు ఈ గేమ్ ఓపెన్ చేసిన వెంటనే టెన్సెంట్ గేమ్స్ లోగోను చూడటానికి ఇదే కారణం, తరువాత పబ్ జి కార్పొరేషన్ అని చూపిస్తుంది. పబ్ జి మొబైల్ క్రమంగా ప్రపంచవ్యాప్తంగా 2018లో విడుదలై మరింత విస్తృతంగా మార్కెట్‌ చేసుకుంది. 
 

click me!