ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, "రీల్స్" 15 సెకన్ల వరకు వీడియోలను రికార్డ్ చేసి ఆడియో ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఎడిటింగ్ చేయడానికి టూల్స్ అందిస్తుంది. యుఎస్, యుకె, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 50 కి పైగా దేశాలలో ఐఓఎస్, అండ్రాయిడ్ రెండింటిలో రీల్స్ ప్రారంభించారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ యు.ఎస్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 కి పైగా దేశాలలో టిక్‌టాక్ పోటీగా రీల్స్‌ను ఆవిష్కరించింది. టిక్‌టాక్ ప్రత్యక్ష సవాలుగా ఇమేజ్-ఫోకస్డ్ ప్లాట్‌ఫామ్‌కు ఇన్‌స్టాగ్రామ్ కొత్త షార్ట్-ఫారమ్ వీడియో ఫీచర్‌ను జోడించింది.
ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, "రీల్స్" 15 సెకన్ల వరకు వీడియోలను రికార్డ్ చేసి ఆడియో ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఎడిటింగ్ చేయడానికి టూల్స్ అందిస్తుంది. యుఎస్, యుకె, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 50 కి పైగా దేశాలలో ఐఓఎస్, అండ్రాయిడ్ రెండింటిలో రీల్స్ ప్రారంభించారు.
undefined
also read
రీల్స్ ఇంతకు ముందు జూన్ నెలలో బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, భారతదేశంలో ప్రారంభించారు. "మీ స్నేహితులు లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరితోనైనా భాగస్వామ్యం చేయడానికి సరదా వీడియోలను క్రియేట్ చేయడానికి రీల్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి" అని కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ లేదా ఇతర పెద్ద సంస్థలో సెప్టెంబరు లోగా ఒప్పందం కుదుర్చుకోవలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకు చెందిన టిక్‌టాక్ కు డెడ్ లైన్ విధించారు.
ఇండియాలో కూడా టిక్‌టాక్‌ను ఇప్పటికే బ్యాన్ చేయగా అమెరికా కూడా నిషేధం విధించాలని భావిస్తుంది. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చేయడంతో అటు అమెరికా యూసర్లను ఇటు ఇండియాలోని యూజర్లను ఆకట్టుకోవడం కోసం షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఫేస్‌బుక్ తీసుకొచ్చింది.