ఒప్పో మొట్టమొదటి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ధర ఎంతో తెలుసా?

By Sandra Ashok Kumar  |  First Published Aug 6, 2020, 1:56 PM IST

గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన ఒప్పో కె5 అప్ డేట్ ఒప్పో కె7. ఒప్పో కె7 క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరిఎంట్స్ ఉన్నాయి, ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో  అందుబాటులోకి రానుంది.  


చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థ ఒప్పో ఒక కొత్త 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఒప్పో కె7 పేరుతో 5జి స్మార్ట్‌ఫోన్ సంస్థ మొట్టమొదటి కె సిరీస్ ఫోన్‌గా చైనాలో లాంచ్ చేసింది.

గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన ఒప్పో కె5 అప్ డేట్ ఒప్పో కె7. ఒప్పో కె7 క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరిఎంట్స్ ఉన్నాయి, ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో  అందుబాటులోకి రానుంది.  

Latest Videos

undefined


ఒప్పో కె7 5జి ధర
ఒప్పో కె7 ధర చైనీస్ రిటైలర్ జెడి.కామ్‌ ప్రకారం 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు సిఎన్‌వై 1,999 (సుమారు రూ. 21,500) కాగా, 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు సిఎన్‌వై 2,299 (సుమారు రూ .24,800).

మొత్తం 5 కలర్ ఆప్షన్స్ ఉన్నట్లు తెలుస్తోంది, నాలుగు కలర్ ఆప్షన్స్ జెడి.కామ్‌లో జాబితా చేయగా, మరొకటి సనింగ్‌ సైట్లో జాబితా చేసింది. జెడిలో జాబితా చేసిన వాటిలో ఫ్లోయింగ్ క్లౌడ్, ఫ్లో ఫ్లేమ్, సీ నైట్, మిస్టరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, పెరాక్ లెమన్ వేరియంట్ సునింగ్‌ సైటులో జాబితా చేసింది.

also read  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. కొద్ది రోజులు మాత్రమే.. ...

ఆగస్టు 11 నుండి సేల్స్ ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం జెడి.కామ్, సనింగ్‌తో పాటు టిమాల్‌తో సహా ఆన్‌లైన్ రిటైలర్లలో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది.

ప్రస్తుతానికి ఒప్పో అంతర్జాతీయ లభ్యతపై ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ముఖ్యంగా ఒప్పో కె5 ఇంకా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించలేదు కాబట్టి ఒప్పో కె7 5జి ఇండియాలోకి అందుబాటులోకి వస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.


ఒప్పో కె7 5జి స్పెసిఫికేషన్లు
సనింగ్, టిమాల్, జెడి.కామ్‌లో ప్రకారం డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 కలర్‌ ఓఎస్ 7.1 తో పనిచేస్తుంది. 408 పిపి పిక్సెల్ 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్  (1,080x2,400 పిక్సెల్‌) అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 765 జి సోసితో పాటు, అడ్రినో జిపియు 620 తో పాటు 8 జిబి ర్యామ్‌తో వస్తుంది.

కెమెరాల విషయానికొస్తే ఒప్పో కె7 5జి వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉన్నాయి, వీటిలో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఎఫ్/1.7 లెన్స్, 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్  కెమెరా ఉంది

స్టోరేజ్ విషయానికొస్తే ఒప్పో కె7 5జిలో  మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ఉండదు. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5జి, వై-ఫై, 4జి-ఎల్‌టిఇ, ఎన్‌ఎఫ్‌సి, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,025 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో గ్రావిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సీమిటి సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఒప్పో కె7 5జి 160.3x74.3x7.96 ఎం‌ఎం సైజుతో 180 గ్రాముల బరువు ఉంటుంది.
 

click me!