. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఒరాకిల్ టిక్‌టాక్ యాప్ తో భాగస్వామ్యనికి చాలా దగ్గరగా ఉందని అమెరికా అధ్యక్షుడు కొద్దిరోజుల క్రితం చెప్పారు. గతంలో దేశ భద్రతకు ముప్పు, గోప్యత ఆందోళనల కారణంగా టిక్‌టాక్ ఏదైనా పెద్ద నమ్మకమైన అమెరికన్ సంస్థకు దాని కార్యకలపాలు సెప్టెంబర్ 20లోగా అమ్మేయలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించిన విషయం తెలిసిందే.
వాషింగ్టన్: చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌తో భాగస్వామ్యం కావడానికి అమెరికన్ కంపెనీ ఒరాకిల్ తో ఒప్పందంపై సంతకం చేయడానికి తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చెప్పారు.
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఒరాకిల్ టిక్‌టాక్ యాప్ తో భాగస్వామ్యనికి చాలా దగ్గరగా ఉందని అమెరికా అధ్యక్షుడు కొద్దిరోజుల క్రితం చెప్పారు.
undefined
గతంలో దేశ భద్రతకు ముప్పు, గోప్యత ఆందోళనల కారణంగా టిక్‌టాక్ ఏదైనా పెద్ద నమ్మకమైన అమెరికన్ సంస్థకు దాని కార్యకలపాలు సెప్టెంబర్ 20లోగా అమ్మేయలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించిన విషయం తెలిసిందే.
అయితే టిక్‌టాక్‌తో ఒరాకిల్ ఒప్పందంపై ఆమోదం ఇంకా కాలేదని, అయితే దీనిపై గురువారం అధికారులతో సమావేశం కానున్నట్లు ట్రంప్ బుధవారం చెప్పారు.
also read
"జాతీయ భద్రతకు సంబంధించినంతవరకు టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాలు 100 శాతం అమెరికన్ సంస్థకు చెంది ఉండాలి. లేదంటే ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా లేను.
ఈ ఒప్పందాన్ని నేను మరోసారి చూడాలి" అని ట్రంప్ విలేకరులతో అన్నారు. అటు టిక్‌టాక్ ఉపయోగించే అల్గోరిథంలను విక్రయించడానికి బైట్‌డాన్స్‌ను అనుమతించబోమని చైనా అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో టిక్ టాక్ బిజినెస్ ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు ఆసక్తిని చూపాయి. చివరికి ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది.
టిక్‌టాక్ ఒక ప్రకటనలో "మేము ట్రెజరీ విభాగానికి ఒక ప్రతిపాదనను సమర్పించాము, ఇది జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరిస్తుందని మేము నమ్ముతున్నాము. అలాగే యుఎస్ లో 100 మిలియన్ల మంది ప్రజలు ఈ యాప్ వినియోగం కొనసాగించడానికి అనుమతిస్తుంది అని తేలిపింది. టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాల అమ్మకంలో గణనీయమైన భాగం యుఎస్ ట్రెజరీకి వెళ్లాలని కూడా ట్రంప్ డిమాండ్ చేశారు.