దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్‌సంగ్ తన వినియోగదారులకు ‘బ్లూ ఫెస్ట్’ పేరిట పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు అమలులో ఉండే ఈ ఆఫర్‌లో ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్ ధరలు వినియోగదారులకు లభించనున్నాయి.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. బ్లూ ఫెస్ట్ సేల్ ఇండియా పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
స్మార్ట్ ఫోన్లతోపాటు టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను రాయితీలపై వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. హెచ్‌డీఎఫ్సీ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసే వారికి 7.5 నుంచి 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
undefined
ఈ బ్లూ ఫెస్ట్ కింద శామ్ సంగ్.. మేక్ మై ట్రిప్, మొబిక్విక్ సంస్థలతో కలిసి వినియోగదారులకు ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి తెచ్చింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం10ఎస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10, నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినట్లు కంపెనీ పేర్కొంది.
Also Read:హైక్ మేసెంజర్ లో కొత్త ఫీచర్
శామ్‌సంగ్ ఎం10ఎస్ స్మార్ట్‌ఫోన్ రూ. 8,499 ఉండగా రూ.1000 డిస్కౌంట్‌తో రూ. 7,999లకు, శామ్‌సంగ్ గెలాక్సీ 9ఫోన్ రూ.73,600 కాగా, రూ. 42,999, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9 ఫోన్ రూ. 62 వేల నుంచి రూ. 29,999కి తగ్గించారు.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం30లో 64 జీబీ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ.15,500 అయితే రూ.13,999లకే అందుబాటులోకి తెస్తున్నది. ఇంకా శామ్‌సంగ్ ఏ50 మోడల్ ఫోన్ ధర రూ.24,900కు బదులు రూ.20,999లకు, గెలాక్సీ ఎం30 ఫోన్ ధర రూ.11,000 నుంచి రూ.9999, గెలాక్సీ ట్యాబ్ ఎస్ 5 ఈ (వై-ఫై) ఫోన్ ధర రూ.38,500 అసలు ధర అయితే రూ.35,999లకే విక్రయిస్తున్నది.
Also Read:జడ్జిమెంట్‌పై రివ్యూకు టెల్కోస్?: కేంద్రం నుంచి జంట లాభాలు
గెలాక్సీ నోట్ 10 విత్ 256 జీబీ ఫోన్ రూ.69,999 గెలాక్సీ ఎస్ 10 ప్లస్ 128 జీబీ ఫోన్ ధర కూడా రూ 69,900లకు లభిస్తుంది. శామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు 7.5శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శామ్‌సంగ్ బ్లూ పెస్ట్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.