ఆపిల్ ఐఫోన్ 11 వాడే కొంతమంది వినియోగదారులు టచ్ స్క్రీన్ సమస్యలను ఎదుర్కొంటున్నాట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కంపెనీ ఉచిత స్క్రీన్ రిప్లేస్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా.. మీ ఐఫోన్ డిస్ ప్లేతో సమస్యలు ఎదుర్కొంటున్నారా.. స్క్రీన్ సరిగ్గా పనిచేయటం లేదా.. అయితే స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ సంస్థ ఐఫోన్ డిస్ ప్లే సమస్యలపై ఫ్రీ స్క్రీన్ రిప్లేస్ మెంట్ అందిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 11 వాడే కొంతమంది వినియోగదారులు టచ్ స్క్రీన్ సమస్యలను ఎదుర్కొంటున్నాట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కంపెనీ ఉచిత స్క్రీన్ రిప్లేస్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కింద ఐఫోన్ 11 వినియోగదారులు వారి ఫోన్ డిస్ ప్లే స్క్రీన్‌ను ఎలాంటి అదనపు కార్చు లేకుండా ఉచితంగా మార్చుకొవచ్చు.
undefined
అయితే ఈ సమస్యను కొద్ది మంది వినియోగదారులు మాత్రమే ఎదుర్కొంటున్నాట్లు సంస్థ పేర్కొంది. మీ ఐఫోన్ 11 డిస్ ప్లే ఫ్రీ రిప్లేస్ మెంట్ అవుతుందో లేదో కోసం చెక్ చేయడానికి, ఫోన్ ఐఎంఈఐ నంబర్ అవసరం. మీకు ఐఫోన్ 11 ఉంటే, ఫోన్ సెట్టింగులకు వెళ్ళి ఐఎంఈఐ నంబర్ ను కనుగొనవచ్చు. ఇందుకోసం ఐఫోన్ లోని సెట్టింగులు> జెనరల్ > ఆప్షన్స్ అనుసరించండి.
also read బడ్జెట్ ధరకే పెద్ద డిస్‌ప్లేతో రిలీజ్ కానున్న నోకియా లేటెస్ట్ ఫోన్.. ఫీచర్స్ ఏంటంటే ? ...
ఆపిల్ సంస్థ ప్రకారం నవంబర్ 2019 నుండి మే 2020 మధ్య ఉత్పత్తి చేసిన ఐఫోన్ 11 మోడల్స్ కి మాత్రమే టచ్ స్క్రీన్ సమస్యలను ఎదుర్కొంటున్నాట్లు వెల్లడించింది. ఉచిత స్క్రీన్ రిప్లేస్ మెంట్ కోసం ఆపిల్ అధికారిక్ వెబ్‌సైట్‌లో సపోర్ట్ పేజీని కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఒకవేళ మీ ఐఫోన్ 11 బాక్స్ పోయినట్లయితే, మీ ఫోన్ తయారీ ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడం కష్టం అయితే ఇందుకోసం ఆపిల్ ఒక సూచన ఇచ్చింది.
మీ ఫోన్ ఐఎంఈఐ నంబరును ఆపిల్ సపోర్ట్ పేజీలో రిజిస్టర్ చేసిన తరువాత వివరాలు తెలుసుకోవచ్చు. తరువాత మీరు సమీపంలోని ఏదైనా ఆపిల్ సర్వీస్ కేంద్రానికి సందర్శించాలి. అక్కడ మీ ఐఫోన్ 11 స్క్రీన్ ఉచితంగా భర్తీ చేస్తారు, ఫోన్‌ను సేవా కేంద్రంలో ఇచ్చే ముందు, ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేసుకోవడం ముఖ్యం.
ఉచిత స్క్రీన్ రిప్లేస్ మెంట్ కార్యక్రమం ప్రారంభానికి ముందు స్రీన్ ఫ్రీ రిప్లేస్ మెంట్ చేయించుకున్న వారికి డబ్బు తిరిగి ఇస్తామని ఆపిల్ తెలిపింది. ఇందుకోసం వారు ఆపిల్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.