JIO OFFERS: జియో ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్ పై కొత్త ఆఫర్...

By Sandra Ashok Kumar  |  First Published Dec 23, 2019, 4:11 PM IST

జియో రూ. 149 రిచార్జ్ ప్లాన్ పై 1.5GB రోజువారీ డేటాతో పాటు ఇప్పుడు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.అయితే రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని 28 రోజుల నుండి 24 రోజులకు తగ్గించింది. ఇందుకోసం జియో నుండి నాన్-జియో కాల్స్ కోసం 300 నిమిషాల ఎఫ్‌యుపి టాక్ టైమ్ అందిస్తుంది.
 


టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో రూ.149 ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్ ను సవరించింది. ఈ రిచార్జ్ ప్లాన్ పై నాన్ జియో కాలింగ్ అదనపు ఆఫర్ ను జోడించింది. అయితే రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని 28 రోజుల నుండి 24 రోజులకు తగ్గించింది. ఇందుకోసం జియో నుండి నాన్-జియో కాల్స్ కోసం 300 నిమిషాల ఎఫ్‌యుపి టాక్ టైమ్ అందిస్తుంది.

also read ఒప్పో నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు...ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో

Latest Videos


ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ పై ఇతర ప్రయోజనాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. జియో రూ.149 రిచార్జ్ ని ఆల్-ఇన్-వన్  ప్రీపెయిడ్ ప్లాన్ లోకి చేర్చింది. ఉచిత నాన్-జియో వాయిస్ కాలింగ్ జియో కస్టమర్లకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. కొత్త మార్చిన రూ. 149 రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్  జియో నుండి జియో ఆన్ లిమిటెడ్ కాల్స్, 300 నిమిషాల జియో నుండి నాన్-జియో కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, ఇంకా రోజుకు 1.5 జిబి డేటా, 24 రోజుల వాలిడిటీ అందిస్తుంది.

జియో నెట్వర్క్   కాంప్లిమెంటరీ  కింద జియో యాప్స్ సుబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ వివరాలను వెల్లడించింది.రిలయన్స్ జియో ఇటీవల జియో నుండి ఇతర ఆపరేటర్ల అన్ని మొబైల్ వాయిస్ కాల్‌లపై నిమిషానికి 6 పైసలు ఛార్జీ  చేసింది. అయితే TRAI ఛార్జ్  సున్నా అయ్యే వరకు మాత్రమే  IUC రికవరీ కొనసాగుతుందని పేర్కొంది. 

also read ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు ఫోన్ చూస్తాడో తెలుసా...?


ఇతర జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్లు నాలుగు విభిన్న వాల్యూస్  అందిస్తాయి. ప్రత్యేకంగా రూ. 222, రూ. 333, రూ. 444, మరియు రూ. 555. జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్ రూ. 222 రిచార్జ్ 2 జిబి రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ జియో-టు-జియో కాల్స్ మరియు ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్‌తో పాటు 1,000 నాన్-జియో నిమిషాలు ఇంకా 28 రోజుల పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు అందిస్తుంది.

అత్యధికంగా రూ. 555 జియో ప్లాన్ 2 జిబి డేటా ప్రయోజనాలతో పాటు 3,000 నిమిషాలు నాన్ జియో కాల్స్, ఆన్ లిమిటెడ్ జియో-టు-జియో కాల్స్ , ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్స్ ఇంకా 84 రోజుల పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు ఇస్తుంది.

click me!