జియో కొత్త ఆఫర్..రిచార్జ్ ప్లాన్ ముగిశాక కూడా కాల్స్ చేసుకోవచ్చు...

By Sandra Ashok Kumar  |  First Published May 14, 2020, 10:46 AM IST

లాక్ డౌన్ సమయంలో పరిమితుల కారణంగా వారి ప్రీపెయిడ్ సిమ్  వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వినియోగదారులందరికీ రిలయన్స్ జియో ఒక చిన్న ఉపశమనాన్ని అందించాలని చూస్తోంది. 


జియో ప్రీపెయిడ్ రీఛార్జి గడువు ముగిసిన తర్వాత ప్రీపెయిడ్ వినియోగదారులందరికీ గ్రేస్ ప్లాన్‌ను అందిస్తోంది. గ్రేస్ ప్లాన్‌ను ఏంటంటే రిచార్జ్ గడువు ముగిసిన తరువాత 24 గంటల వరకు వినియోగదారులు ఆన్ లిమిటెడ్ జియో-టు-జియో కాల్స్ చేసుకోవచ్చు.

లాక్ డౌన్ సమయంలో పరిమితుల కారణంగా వారి ప్రీపెయిడ్ సిమ్  వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వినియోగదారులందరికీ రిలయన్స్ జియో ఒక చిన్న ఉపశమనాన్ని అందించాలని చూస్తోంది. ఈ కొత్త ఆఫర్ టెలికాం ఆపరేటర్ జియో రూ. 2,399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 2 జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలతో పాటు 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

Latest Videos

కొత్త రిలయన్స్ జియో గ్రేస్ ప్లాన్‌ను స్టాండర్డ్ గా రిచార్జ్ ప్లాన్ ముగిసినప్పటి నుండి కేవలం 24 గంటలు మాత్రమే అని, రిలయన్స్ జియో వినియోగదారులు ఈ గ్రేస్ ప్లాన్‌ సమయంలో సేవలను అంతరాయం కలగకుండా ఉంటుంది.

గ్రేస్ ప్లాన్‌ ముగిసేలోపు వారి ఖాతాను రీఛార్జ్ చేసుకోవాలి. ఈ గ్రేస్ వ్యవధిలో, జియో వినియోగదారులు ఆన్ లిమిటెడ్ జియో-టు-జియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ కొత్త గ్రేస్ ప్లాన్ సంబంధించి జియో అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ఒకే గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందో లేదో ధృవీకరించలేదు.

also read విపణిలోకి రియల్‌ మీ నార్జో సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. ధర ఎంతంటే?!

జియో ఇటీవల కొత్త లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాను ప్రారంభించింది. ఈ కొత్త రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జీబీ హై-స్పీడ్ డైలీ డేటా, 365 రోజుల పాటు ఆన్ లిమిటెడ్  వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు.

ఈ కొత్త లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు, జియో కూడా రూ. 151, రూ. 201, రూ. 251 వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్-ఆన్ ప్యాక్‌ ద్వారా  రూ. 151 ప్యాక్ 30GB అదనపు హై-స్పీడ్ డేటాను అందిస్తుంది, రూ. 201 ప్యాక్ 40GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది,

రూ. 251 ప్యాక్ 50GB హై-స్పీడ్ డేటాను ఇస్తుంది. ఈ యాడ్-ఆన్ ప్యాక్‌లు వాలిడిటీతో రావు, ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్ గడువును కొనసాగిస్తాయి. సాధారణ వినియోగదారులకు ఇతర వినియోగదారులకు రీఛార్జ్ చేయడానికి, అలాగే  కమీషన్ సంపాదించడానికి అనుమతించే కొత్త జియోపి‌ఓ‌ఎస్ లైట్ యాప్  కూడా జియో ప్రవేశపెట్టింది.

click me!