సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌లో 960 ఉద్యోగాల కట్..

By Sandra Ashok KumarFirst Published Jul 22, 2020, 10:43 AM IST
Highlights

కోవిడ్ -19 వ్యాప్తి "పెయిడ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్  డిమాండ్‌పై నిరంతర ప్రభావాన్ని చూపుతోంది" అని మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. 

వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పెయిడ్  రిక్రూట్మెంట్ సర్వీసెస్ డిమాండ్‌ పై ప్రభావం చూపడంతో ప్రొఫెషనల్ సోషల్ నెట్‌వర్క్ సంస్థ లింక్డ్ఇన్ మంగళవారం 960 ఉద్యోగాలను అంటే ఆరు శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది.

కోవిడ్ -19 వ్యాప్తి "పెయిడ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్  డిమాండ్‌పై నిరంతర ప్రభావాన్ని చూపుతోంది" అని మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక తిరోగమనంలో పెరుగుతున్న నిరుద్యోగం మధ్య ఈ చర్య వచ్చింది.

also read బెంగళూరులో కొత్త జూమ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం ... ...

కోవిడ్‌-19 ప్రభావంతో  ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తుండటంతో వేల సంఖ్యలో వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నారు.    కంపెనీలో మరింత సిబ్బందిని  తొలగించే ఉద్దేశం లేదని మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డ్‌ఇన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ర్యాన్‌   రాస్‌ల్యాన్‌స్కై పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగులకు, వ్యాపారాలకు సహాయపడటానికి కొత్త ఫీచర్లను జోడించినట్లు లింక్డ్ఇన్ తెలిపింది. కరోనా మహమ్మారితో పోరాడేవారికి నియామక సాధనాలను ఉచితంగా చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల మందికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయం చేస్తామని కంపెనీ ప్రతిజ్ఞ చేసింది. లింక్డ్ఇన్ 10 వారాల వేతనం, ఇతర ప్రయోజనాలను  తొలగించిన ఉద్యోగులకు అందించనుంది. వారికి కొత్త ఉద్యోగాలను కనుగొనడంలో సహాయం అందిస్తుంది.
 

click me!