ఈ ఒప్పో స్లైడ్ ఫోన్ క్రెడిట్ కార్డు సైజులో ఉంటుంది. దీనిని మడత పెడితే 54 ఎంఎంx 84 ఎంఎం మందంతో ఉంటుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఒకే దిశలో వంగే మూడు మడతల స్క్రీన్ ఉంటుంది.
ప్రముఖ జపనీస్ డిజైన్ స్టూడియో నెండో సహకారంతో ట్రిపుల్-హింజ్ ఫోల్డబుల్ డిజైన్‌తో 'స్లైడ్ ఫోన్' అని పిలువబడే కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో ప్రవేశపెట్టింది.
ఈ ఒప్పో స్లైడ్ ఫోన్ క్రెడిట్ కార్డు సైజులో ఉంటుంది. దీనిని మడత పెడితే 54 ఎంఎంx 84 ఎంఎం మందంతో ఉంటుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఒకే దిశలో వంగే మూడు మడతల స్క్రీన్ ఉంటుంది.
undefined
"స్లైడ్-ఫోన్" ఏమిటంటే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్ ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎక్కువగా సంభాషించడానికి ఉపయోగిస్తారు, అయితే ఈ స్లైడ్-ఫోన్ 3 విధాలుగా వినియోగదారుని సరిపోయే సైజులో స్క్రీన్ మార్చడానికి అనుమతిస్తుంది" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
also read
మొదటి స్లైడింగ్ లో కాల్ హిస్టరీ, నోటిఫికేషన్‌లు లేదా మ్యూజిక్ ప్లేయర్ ఇంటర్‌ఫేస్ కోసం 40 ఎంఎం స్క్రీన్‌ను, తదుపరి స్లయిడ్ లో 80 ఎంఎం స్క్రీన్‌తో కెమెరాను ఓపెన్ చేస్తుంది. ఇది సెల్ఫీలు తీసుకోవటానికి, వీడియో కాల్స్ చేయడానికి సహాయపడుతుంది. పూర్తిగా ఫోన్ ఓపెన్ చేశాక ఫోన్ డిస్ ప్లే ఏడు అంగుళాలు సైజ్ ఉంటుంది.
మొత్తం స్క్రీన్‌ను ఓపెన్ చేస్తే మీకు గేమింగ్, మల్టీ-టాస్కింగ్ లేదా వీడియోలను చూడటానికి స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ కి ఒకవైపు మ్యూజిక్ ప్లే/స్టాప్ ,మ్యూట్, వాల్యూమ్ షట్టర్ వంటి బటన్లు ఉన్నాయి.
ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాధారణ ఛార్జింగ్ తో పాటు దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు ఒప్పో విడుదల చేసిన ఒక వీడియోలో తెలుస్తుంది. ఫోన్ స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను అందిస్తుందని కంపెనీ తెలుపగ, ఇది పాక్షికంగా మడతపెట్టెల రూపొందించబడింది.