అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్: 40% వరకు డిస్కౌంట్ తో లభించే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Dec 21, 2020, 11:59 AM IST
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్: 40% వరకు డిస్కౌంట్ తో లభించే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

సారాంశం

ఈ ఫెస్టివల్ సేల్ సమయంలో స్మార్ట్ ఫోన్లు, డివైజెస్ పై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమితో సహ ఇతర బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందిస్తుంది.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్  ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి ప్రారంభమై డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ ఫెస్టివల్ సేల్ సమయంలో స్మార్ట్ ఫోన్లు, డివైజెస్ పై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది.

ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమితో సహ ఇతర బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందిస్తుంది. నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో పాటు  ఇయర్ ఎండ్ సేల్ కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై 1,500 వరకు క్యాహ్ బ్యాక్ ఇస్తుంది.

అమెజాన్ మైక్రోసైట్ లో ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా డిస్కౌంట్ ధరలకు లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ 8 టి, వన్‌ప్లస్ నార్డ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 51, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 31, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఉన్నాయి. ఈ సేల్ డిసెంబర్ 22న మంగళవారం ప్రారంభమై క్రిస్మస్ రోజు వరకు కొనసాగుతుంది.

also read రిలయన్స్ జియోకి పోటీగా బిఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్.. రూ.300లోపు లభించే బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ...

అంతేకాకుండా అమెజాన్  ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా విక్రయించే ఉపకరణాలలో పవర్ బ్యాంకులు, హెడ్‌సెట్‌లు, చార్జింగ్ కేసులు, కవర్లు, కేబుల్స్, ఛార్జర్‌లు ఉన్నాయి.

అమెజాన్ ప్రస్తుతం జాబ్రా డేస్ సేల్ నిర్వహిస్తుంది, ఇది డిసెంబర్ 25 వరకు ఉంటుంది. ఈ సేల్ సమయంలో జబ్రా ఉత్పత్తులపై 70 శాతం తగ్గింపుతో డిస్కౌంట్ ధరకు లభిస్తాయి.

అమెజాన్ ప్రస్తుతం ఇటీవల లాంచ్ చేసిన ఫోన్లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ. 13,999, దీనిపై రూ.1,000 తగ్గింపుతో రూ. 12,999కు అందిస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే