13 ఎక్స్సైజ్ మోడ్స్ తో వన్‌ప్లస్ బ్యాండ్ లాంచ్.. ఫీచర్స్, ధర తేలుసుకొండి..

By S Ashok KumarFirst Published Jan 11, 2021, 5:10 PM IST
Highlights

మొట్టమొదటి ఫిట్‌నెస్ ట్రాకర్ బ్యాండ్‌తో భారతదేశంలో వెరబుల్ విభాగంలోకి వన్‌ప్లస్ అధికారికంగా ప్రవేశించింది.  

వన్‌ప్లస్ నుండి వస్తున్న మొట్టమొదటి ఫిట్‌నెస్ ట్రాకర్ బ్యాండ్‌తో భారతదేశంలో వెరబుల్ విభాగంలోకి వన్‌ప్లస్ అధికారికంగా ప్రవేశించింది.  షియోమి పాపులర్ మోడల్ ఎం‌ఐ బ్యాండ్ సిరీస్, హానర్ బ్యాండ్ 5కి వన్‌ప్లస్  బ్యాండ్‌ చాలా పోలి ఉంటుంది.

"మా మొట్టమొదటి వెరబుల్ ఉత్పత్తి వన్‌ప్లస్ బ్యాండ్ మా కమ్యూనిటిలోకి తీసుకురావడాన్ని మేము సంతోషిస్తున్నాము "అని వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు అండ్ సి‌ఈ‌ఓ పీట్ లా అన్నారు. అలాగే వచ్చే ఏడాది చివరి కల్లా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనున్నట్లు వన్‌ప్లస్ పేర్కొంది. జనవరి 13 నుండి అమెజాన్, ఫ్లిప్ కార్టులో ఫస్ట్ సేల్ ద్వారా అందుబాటులోకి రానుంది. 

ఈ బ్యాండ్ ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి  డిస్ ప్లే, 24x7 హార్ట్ బీట్ సెన్సార్, దుమ్ము ఇంకా నీటి నిరోధకత కోసం ఐ‌పి68 రేటింగ్‌ కూడా ఉంది. దీనికి రిమూవబుల్ ట్రాకర్ డిజైన్‌ ఉంది, దీని ద్వారా డైనమిక్ డ్యూయల్-కలర్ స్ట్రాప్ కాంబో మార్చడానికి  ఉపయోగపడుతుంది.

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ బ్యాండ్ ధర 2,499 రూపాయలు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ స్టోర్ ద్వారా 13 జనవరి 2021 నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ బ్యాండ్ నల్ల పట్టీతో వస్తుంది, అయితే మీరు టాన్జేరిన్ గ్రే, నేవీ డ్యూయల్ కలర్ పట్టీలను విడిగా 399 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. 

also read  ఆపిల్ స్టోర్, ప్లే స్టోర్ నుండి పార్లర్ యాప్ తొలగింపు.. అమెరికాలొ జరిగిన దాడికి ఈ ఉపయోగించినట్లు ఆరోపణ...

వన్‌ప్లస్ బ్యాండ్  ఫీచర్స్ 

1.6-అంగుళాల టచ్-సెన్సిటివ్ ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే, 126x294 పిక్సెల్స్ రిజల్యూషన్, డ్యూయల్-కలర్ బ్యాండ్ డిజైన్‌తో వస్తుంది. పూల్ స్విమ్మింగ్, యోగా, ఫ్యాట్ బర్న్ రన్, అవుట్ డోర్ వాక్, అవుట్-డోర్ సైక్లింగ్, అవుట్-డోర్ రన్, ఇండోర్ రన్, ఇండోర్ సైక్లింగ్, ఎలిప్టికల్ ట్రైనర్, రోయింగ్ మెషిన్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫ్రీ ట్రెనింగ్ తో సహా 13  ఎక్స్ సైజ్  మోడ్స్ ఇందులో ఉన్నాయి.

ఈ బ్యాండ్ డస్ట్‌ప్రూఫ్, ఇంకా 10 నిమిషాల పాటు 50 మీటర్ల వరకు వాటర్ రిసిస్టంట్ కలిగి ఉంటుంది. 100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఒకే ఛార్జ్‌లో రెండు వారాల వరకు బ్యాకప్ ఇస్తుంది. దీనిలో బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ఉన్నాయి.

వినియోగదారులు ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే ఎక్కువ అప్ డేట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో బ్యాండ్‌ను కనెక్ట్ చేయవచ్చు. మ్యూజిక్, కెమెరా షట్టర్ కంట్రోల్స్, కాల్స్,  మెసేజ్ నోటిఫికేషన్‌లకు యాక్సెస్ చేయవచ్చు. వన్‌ప్లస్ హెల్త్ యాప్ ద్వారా వన్‌ప్లస్ బ్యాండ్ స్మార్ట్‌ఫోన్లో కూడా పనిచేస్తుంది. దీని బరువు 10.3 గ్రాములు. 

click me!