
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఇ7 ప్లస్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో బ్రెజిల్‌లో ఆవిష్కరించిన కొత్త ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాలు, వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లే నాచ్‌తో వస్తుంది.
మోటో ఇ7 ప్లస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ఎస్‌ఓసితో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫోన్ రెండు విభిన్న కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. అంతేకాకుండా మోటో ఇ7 ప్లస్ భారతదేశంలో రెడ్‌మి 9 ప్రైమ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11, రియల్ మీ నార్జో 20 వంటి వాటితో పోటీపడుతుంది.
భారతదేశంలో మోటో ఇ7 ప్లస్ ధర, సెల్ తేదీ
భారతదేశంలో మోటో ఇ7 ప్లస్ ధర సింగిల్ వెరీఎంట్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర 9,499 రూపాయలు. ఫోన్ మిస్టి బ్లూ, ట్విలైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాకుండా సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
మోటో ఇ7 ప్లస్ ధర ప్రపంచవ్యాప్తంగా యూరో 149 (అంటే సుమారు రూ .12,800) ధరతో ప్రారంభించారు.
also read 8జిబి ర్యామ్, భారీ బ్యాటరీతో పోకో ఎక్స్3 స్మార్ట్ ఫోన్ లాంచ్.. ...
మోటో ఇ7 ప్లస్ ఫీచర్స్
డ్యూయల్ సిమ్ నానో, ఆండ్రాయిడ్ 10, 6.5-అంగుళాల హెచ్‌డి + మాక్స్ విజన్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 వీటితో పాటు అడ్రినో 610 జిపియు, 4 జిబి ర్యామ్ ఉన్నాయి. ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయడానికి మోటో ఇ7 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది.
ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఎఫ్/1.7 లెన్స్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది.
మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవం కోసం మోటో ఇ7 ప్లస్ కెమెరా ఫీచర్లతో ప్రీలోడ్ చేయబడింది, అలాగే ఆటో స్మైల్ క్యాప్చర్, స్మార్ట్ కంపోజిషన్, షాట్ ఆప్టిమైజేషన్, పోర్ట్రెయిట్ మోడ్, స్పాట్ కలర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సపోర్ట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి.
టైమ్‌లాప్స్ ఇంకా స్లో మోషన్ వీడియోల కోసం హై-రెస్ జూమ్, హైపర్‌లాప్స్ ప్లస్ స్లో-మోషన్ వీడియో ఫీచర్స్ ఉన్నాయి.
మైక్రో ఎస్‌డికార్డ్ ద్వారా 512జిబి వరకు సపోర్ట్ తో 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్స్ లో 4జి ఎల్‌టిఇ, వై-ఫై బి / జి / ఎన్, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మోటో ఇ7 ప్లస్ లో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఒకే ఫుల్ ఛార్జీపై రెండు రోజుల వస్తుంది. ఫోన్ బరువు 200 గ్రాములు ఉంటుంది.