భారతదేశంలో ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రో విడుదల తేదీని నవంబర్ 3న నిర్ణయించినట్లు షియోమి అధికారిక సైట్ ఎంఐ.కామ్ ద్వారా వెల్లడించింది. అధికారికంగా లాంచ్ తేదీని వెల్లడించిన కంపెనీ షిప్పింగ్ షెడ్యూల్‌ను వెల్లడించలేదు. అయితే ఎంఐ 10టి, ఎంఐ 10 టి ప్రో స్మార్ట్ ఫోన్స్ గురువారం నుండి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం సిద్దంగా ఉన్నాయి.
భారతదేశంలో ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రో విడుదల తేదీని నవంబర్ 3న నిర్ణయించినట్లు షియోమి అధికారిక సైట్ ఎంఐ.కామ్ ద్వారా వెల్లడించింది. అధికారికంగా లాంచ్ తేదీని వెల్లడించిన కంపెనీ షిప్పింగ్ షెడ్యూల్‌ను వెల్లడించలేదు. అయితే ఎంఐ 10టి, ఎంఐ 10 టి ప్రో స్మార్ట్ ఫోన్స్ గురువారం నుండి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం సిద్దంగా ఉన్నాయి.
ఎంఐ.కామ్ లో ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రో నవంబర్ 3 నుండి భారతదేశంలో షిప్పింగ్ ప్రారంభమవుతాయని చూపిస్తూన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అధికారిక ఆన్‌లైన్ సెల్ పార్ట్నర్ అయిన ఫ్లిప్‌కార్ట్ నవంబర్ 3 లాంచ్ తేదీగా హైలైట్ చేస్తోంది.
undefined
భారతదేశంలో ఎంఐ 10టి, ఎంఐ 10 టి ప్రో ధర
భారతదేశంలో ఎంఐ 10టి ధర 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.35,999 రూపాయలు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లో కూడా వస్తుంది, దీని ధర రూ. 37,999.
ఎంఐ 10 టి ప్రో సింగిల్ వెరీఎంట్ 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ధర రూ.39,999. ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రో రెండూ కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది, అయితే 10టి ప్రోలో అరోరా బ్లూ షేడ్ కొత్త కలర్ ఆప్షన్ కూడా ఉంది.
also read
ఎంఐ 10టి, ఎంఐ 10 టి ప్రో స్పెసిఫికేషన్లు
ఎంఐ 10టి, ఎంఐ 10 టి ప్రో రెండూ ఆండ్రాయిడ్ 10 MIUI 12తో పనిచేస్తాయి. 6.67 ఇంచ్ పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంది, 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC ద్వారా పనిచేస్తాయి. ఎంఐ 10టిలో 6 జిబి, 8 జిబి ర్యామ్ రెండు ఆప్షన్లు ఉండగా, ఎంఐ 10టి ప్రోలో 8 జిబి ర్యామ్ తో స్టాండర్డ్ గా వస్తుంది. రెండు ఫోన్‌లలో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
ఫోటోలు, వీడియోల కోసం ఎంఐ 10టి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
మరోవైపు ఎంఐ 10టి ప్రోలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. రెండు ఫోన్లు ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తాయి.
ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రో రెండు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. రెండూ 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్), యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌తో సహా మరెన్నో కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.