4జి డౌన్‌లోడ్ స్పీడ్ లో రిలయన్స్ జియో టాప్, అప్‌లోడ్‌లో స్పీడ్‌లో వోడాఫోన్: ట్రాయ్

By Sandra Ashok Kumar  |  First Published Oct 16, 2020, 4:18 PM IST

ట్రాయ్ 2020 సెప్టెంబరులో ప్రచురించిన ఆవరేజ్ 4జి డౌన్‌లోడ్ స్పీడ్ చార్టులో రిలయన్స్ జియో టాప్ ప్లేస్ లో నిలిచింది. రిలయన్స్ జియో సెప్టెంబర్ నెలలో 19.3 ఎం‌బి‌పి‌ఎస్  ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ సాధించింది


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 2020 సెప్టెంబరులో ప్రచురించిన ఆవరేజ్ 4జి డౌన్‌లోడ్ స్పీడ్ చార్టులో రిలయన్స్ జియో టాప్ ప్లేస్ లో నిలిచింది.

రిలయన్స్ జియో సెప్టెంబర్ నెలలో 19.3 ఎం‌బి‌పి‌ఎస్  ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ సాధించింది, గత నెల ఆగస్టులో 15.9 ఎం‌బి‌పి‌ఎస్ నుండి ఈ నెల మరింత స్పీడ్ పెరిగింది. రిలయన్స్ జియో గత మూడు సంవత్సరాలుగా వరుసగా 4జి ఆపరేటర్‌గా నిలిచింది.

Latest Videos

undefined

ట్రాయ్ ప్రచురించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్‌టెల్ పనితీరు ఆగస్టులో 7.0 ఎం‌బి‌పి‌ఎస్  నుండి 7.5 ఎం‌బి‌పి‌ఎస్ అంటే స్వల్పంగా మెరుగుపడింది. వోడాఫోన్ అండ్  ఐడియా సెల్యులార్ వ్యాపారాలను విలీనం చేసినప్పటికీ, ట్రాయ్ వారి నెట్‌వర్క్ పనితీరును విడిగా ప్రచురిస్తుంది.

also read 

వొడాఫోన్ నెట్‌వర్క్ సెప్టెంబరులో 7.9 ఎం‌బి‌పి‌ఎస్  ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ నమోదు చేసింది, ఆగస్టులో 7.8 ఎం‌బి‌పి‌ఎస్  నుండి స్వల్పంగా పెరిగింది.

ఆగస్టు నెలలో ఐడియా ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 8.3 ఎమ్‌బిపిఎస్ నుండి సెప్టెంబర్‌లో 8.6 ఎమ్‌బిపిఎస్‌కు మెరుగుపడింది. వోడాఫోన్ ఆవరేజ్ 4జి అప్‌లోడ్ స్పీడ్ 6.5 ఎమ్‌బిపిఎస్‌తో అగ్రస్థానంలో నిలిచింది, ఆగస్టు నెలలో ఇది 6.2 ఎమ్‌బిపిఎస్ నుండి మెరుగుపడింది.

ఐడియా సెప్టెంబర్‌లో 6.4 ఎమ్‌బిపిఎస్ ఆవరేజ్ అప్‌లోడ్ స్పీడ్ నమోదు చేయగా, ఎయిర్‌టెల్ ఇంకా జియో రెండూ ఒకే ఆవరేజ్ అప్‌లోడ్ స్పీడ్ 3.5 ఎమ్‌బిపిఎస్ సాధించాయి. అప్ లోడ్, డౌన్ లోడ్ ఆవరేజ్ స్పీడ్ ను మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో రియల్ టైమ్ డేటా ఆధారంగా ట్రాయ్ చే లెక్కించబడుతుంది.
 

click me!