ఇండియాలో పబ్- జి లాంటి గేమ్స్ ఏవో తెలుసా..

By Sandra Ashok KumarFirst Published Sep 4, 2020, 10:58 AM IST
Highlights

 పబ్- జి గేమ్ బ్యాన్ కంటే ముందు 59 చైనా యాప్స్ ని కూడా ఇండియా నిషేధించింది. అయితే ఈ నిషేధాలకు ఇండియా- చైనా సరిహద్దు వివాదాలే కారణం. భారతదేశంలో పబ్- జి మొబైల్ నిషేధం వల్ల గేమ్ లవర్స్ ని ఆశ్చర్య పరిచింది.  

గేమింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన "పబ్- జి"పై భారతీయ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పబ్- జి గేమ్ లాంచ్ చేసినప్పటి నుంచి తక్కువ సమయంలోనే అత్యధిక డౌన్ లోడ్స్, పాపులరిటీ సంపాదించింది.

 పబ్- జి గేమ్ కి పోటీగా ఇతర గేమ్స్ నిలబడలేకపోయాయి. పబ్- జి గేమ్ బ్యాన్ కంటే ముందు 59 చైనా యాప్స్ ని కూడా ఇండియా నిషేధించింది. అయితే ఈ నిషేధాలకు ఇండియా- చైనా సరిహద్దు వివాదాలే కారణం. భారతదేశంలో పబ్- జి మొబైల్ నిషేధం వల్ల గేమ్ లవర్స్ ని ఆశ్చర్య పరిచింది.  

క్రియేటివ్ డిస్ట్రక్షన్, సైబర్ హంటర్, రూల్స్ ఆఫ్ సర్వైవల్ అనే మూడు అత్యంత ప్రజాదరణ పొందిన పబ్- జి మొబైల్ ప్రత్యామ్నాయా గేమ్స్  కూడా భారతదేశంలో నిషేధించింది. అయితే మీ ఆండ్రయిడ్, ఐ‌ఓ‌ఎస్ రెండింటిలోనూ మీరు ప్లే చేయగల కొన్ని ముఖ్యమైన పబ్- జి మొబైల్ గేమ్ ప్రత్యామ్నాయాలు ఇక్కడ ఉన్నాయి.


కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్
కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ కంటే గరేనా ఫ్రీ ఫైర్ ఎక్కువ పాపులరిటీ పొందింది. పబ్- జి మొబైల్‌పై నిషేధం తరువాత  గేమింగ్ టోర్నమెంట్లలో జనాదరణ పొందిన బ్యాటిల్ రాయల్ గేమ్ భర్తీ చేయడానికి కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ బెస్ట్ ఆప్షన్ గా మారుతుంది. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ లో అతిపెద్ద ఓపెనింగ్‌ ఉంది.  పిసి / కన్సోల్ కాల్ ఆఫ్ డ్యూటీ వెర్షన్ల నుండి లెగసీ ఎలిమెంట్స్‌తో ఇది ఎప్పటికప్పుడు ఉత్తమ మొబైల్ గేమ్‌లలో ఒకటిగా నిలిచింది. పబ్- జి మొబైల్ కంటే ఇది మంచి గేమ్.

గారెనా ఫ్రీ ఫైర్
గరేనా ఫ్రీ ఫైర్ ప్రస్తుతానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మొబైల్ గేమ్, గూగుల్ ప్లే స్టోర్‌లో 500 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి.  దీనికి గేమర్స్ గ్రూప్ కూడా ఉంది. ఇది రెగ్యులర్ సీజన్లు, గేమ్స్ అప్ డేట్ అందిస్తుంది. బలమైన గేమింగ్సిస్టం కూడా ఉంది.

also read 

క్లాసిక్ బాటిల్ రాయల్ 
గేమ్స్ డిజైన్, ఫోర్ట్‌నైట్ మధ్య బ్యాటిల్ రాయల్ చాలా ఆసక్తికరమైన క్రాస్ఓవర్‌గా పరిగణించవచ్చు. ఈ గేమ్ మరింత కాంపాక్ట్ గేమింగ్ అనుభవం అందిస్తుంది. ఇక్కడ బ్యాటిల్ రాయల్ బౌట్ 3 నుండి 5 నిమిషాలు ఉంటుంది.

నైవ్స్ అవుట్
నైవ్స్ అవుట్ గేమ్ కూడా జనాదరణ పొందుతుంది. దాదాపు 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. దీనిని ఇండియాలో నిషేధించలేదు. ఆసక్తిగల గేమర్స్ ఇందులో  టైటిల్‌ కోసం ప్రయత్నించవచ్చు. నైవ్స్ అవుట్ ఒక ఇంట్రెస్టింగ్ మార్షల్ స్టైల్ గేమ్, ఇందులో ఆకట్టుకునే గ్రాఫిక్స్ ఉన్నాయి.

బుల్లెట్ లీగ్
బుల్లెట్ లీగ్ ఒక బ్యాటిల్ రాయల్ ప్లాట్‌ఫార్మర్, ఇది హాట్‌లైన్ మీయామి గేమ్ ని  గుర్తుచేస్తుంది. ఆసక్తికరమైన గేమ్‌ప్లే డిజైన్లలో ఇది ఒకటి. నాస్టాల్జిక్ 2డి గేమ్ డిజైన్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్న బ్యాటిల్ రాయల్ గేమ్ అత్యంత ఇంట్రెస్టింగ్ గేమ్స్ ప్లేలలో ఒకటి. ఇది చాలా తక్కువ ప్రజాదరణ పొందింది, కానీ చాలా బాగుంటుంది.

click me!