యూత్ కోసం గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన లెనోవా.. ఫీచర్స్ ఆధుర్స్

By Sandra Ashok KumarFirst Published Jul 23, 2020, 5:48 PM IST
Highlights

స్మార్ట్ ఫోన్ మొబైల్ గేమర్స్ కోసం గేమ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సరికొత్త  యుఐతో వస్తుంది. ఆసుస్ రోగ్  ఫోన్ 3, నుబియా రెడ్ మ్యాజిక్ 5ఎస్ పోటీగా లెనోవా లెజియన్ ఫోన్ డ్యుయల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865ప్లస్  ఎస్‌ఓ‌సితో పనిచేస్తుంది. 

2020లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమింగ్ ఫోన్‌లలో ఒకటైన లెనోవా లెజియన్ ఫోన్ డ్యూయల్ చివరకు ఒక వైపు పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో, డ్యూయల్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

స్మార్ట్ ఫోన్ మొబైల్ గేమర్స్ కోసం గేమ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సరికొత్త  యుఐతో వస్తుంది. ఆసుస్ రోగ్  ఫోన్ 3, నుబియా రెడ్ మ్యాజిక్ 5ఎస్ పోటీగా లెనోవా లెజియన్ ఫోన్ డ్యుయల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865ప్లస్  ఎస్‌ఓ‌సితో పనిచేస్తుంది.

also read టిక్‌టాక్‌పై నిషేధానికి అమెరికాలో బిల్లు ఆమోదం.. ...

ఈ ఫోన్‌లో 144Hz డిస్ ప్లే, డ్యూయల్ అల్ట్రాసోనిక్ ట్రిగ్గర్ బటన్లతో పాటు డ్యూయల్ వైబ్రేషన్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 37,320గా నిర్ణయించారు. తొలుత స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని  తర్వాత ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాల్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

లెనోవా లెజియన్‌ ఫోన్‌ డ్యూయల్‌ 6.65 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఒకవైపు పాప్‌-అప్‌ సెల్ఫీ కెమెరా, డ్యూయల్‌ బ్యాటరీ ప్యాక్‌లతో డిజైన్‌ చేశారు. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన   రెండు 2,500   ఎంఏహెచ్  బ్యాటరీలు ఇందులో ఉంటాయి.  

90W  టర్బో పవర్‌  చార్జింగ్‌ను కూడా   ఇది సపోర్ట్ చేయనుంది. దీని ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం వరకు  చార్జింగ్  చేయొచ్చు.  30 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్‌ చార్జింగ్ అవుతుంది.  12జీబీ, 16జీబీ  ర్యామ్  ఆప్షన్లలో వస్తోంది.

click me!