రిలయన్స్ జియో కస్టమర్లకు కాంప్లిమెంటరీ గిఫ్ట్.. ఉచితంగా ప్రీమియం కంటెంట్..

By Sandra Ashok Kumar  |  First Published Jul 9, 2020, 10:55 AM IST

కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద తన కస్టమర్లకి లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను అక్సెస్ కల్పిస్తోంది. జియోఫైబర్‌ సిల్వర్ లేదా అంతకు మించిన ప్లాన్‌ పొందిన వారకి ఇది అందుబాటులోకి రానుంది. 


ముంబై: రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్తను అందించింది. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది. లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పిస్తోంది. జియోఫైబర్‌ సిల్వర్, అంతకు మించిన ప్లాన్‌ వారకి లయన్స్‌గేట్ ప్లే కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. 

జియో ఫైబర్ వినియోగదారులు ఇక స్టార్జ్ ఒరిజినల్ సిరీస్, ఫస్ట్-రన్‌ సినిమాలతోపాటు ఇతర టీవీ, సినిమా కంటెంట్ (7500 ఎపిసోడ్లు), ఇతర పాపులర్ ప్రోగ్రామ్స్‌ వీక్షించవచ్చు. ఈ సదుపాయం తక్షణం అమల్లోకి వచ్చింది.

Latest Videos

లయన్స్‌గేట్‌లో హారర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ, సినిమాల కంటెంట్ ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, భోజ్ పురి భాషల్లో లయన్స్‌గేట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలను వీక్షించవచ్చు. 

జియోఫైబర్ సిల్వర్ యూజర్లు అంటే ఒక నెల కంటే ఎక్కువ నెలలు ప్లాన్ల గలవారు ఈ కాంప్లిమెంటరీ ఆఫర్ సాయంతో వీక్షించవచ్చు. అలాగే, కొత్త వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియోటీవీ+ యాప్ నుంచి జియోఫైబర్ యూజర్లు లయన్స్ గేట్ ప్లే కంటెంట్ చూడవచ్చు. 

also read ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంకి పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది.. ...

దీని కోసం ప్రత్యేకంగా లాగిన్ అవ్వడం లేదా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణం కన్నా ఎక్కువ కంటెంట్‌ను వీక్షించాలనుకునే జియోఫైబర్ యూజర్లు గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లాన్‌లో హై స్పీడ్, ఎక్కువ బ్రాడ్ బ్యాండ్ డాటా లభిస్తుంది. గోల్డ్ ప్లాన్ భిన్నరకాలైన సేవలను అందిస్తుంది. 

గోల్డ్ ప్లాన్‌లో 250 ఎంబీపీఎస్‌ స్పీడ్, నెలకు 1750 జీబీ డేటా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయం, దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు అంతర్జాతీయ కాల్స్‌ను తక్కువ ధరకే అందిస్తుంది. 

దీని ఎనీటైమ్ టీవీ ద్వారా ప్రీమియం ఓటీటీ వేదికలు అయిన లయన్స్‌గేట్ ప్లే, జీ 5, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, సన్‌నెక్స్ట్, వూట్, ఆల్ట్‌బాలాజీ, హోయిచోయ్, షెమరూమ్, జియో సినిమా, జియోసావ్న్ వంటి ప్రీమియం ఓటీటీ లాంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది. 

వీటితో పాటు గోల్డ్‌ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ ), అన్ లిమిటెడ్ మ్యూజిక్, గేమ్స్, జియో యాప్స్‌ను అన్ లిమిటెడ్‌గా యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది

 

click me!