లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇంటి నుండే పనిచేస్తున్నారు వారికి కోసం అధిక డాటా అందించేంధుకు ఈ కొత్త ప్లాన్ ను శుక్రవారం ప్రవేశపెట్టింది.
రిలయన్స్ జియో వరుస సంచలనాల తరువాత ఇప్పుడు హై డేటా ప్రీపెయిడ్ యూసర్ల కోసం మరో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇంటి నుండే పనిచేస్తున్నారు వారికి కోసం అధిక డాటా అందించేంధుకు ఈ కొత్త ప్లాన్ ను శుక్రవారం ప్రవేశపెట్టింది.
అయితే ఈ ప్లాన్ వాలిడిటీ ఒక నెలకు కాదు మూడు నెలల వాలిడిటీ ప్లాన్ తో వస్తుంది. రోజుకు 3జిబి డేటాను కేవలం రూ .999 కు 84 రోజుల వాలిడిటీ అందిస్తుంది. అంటే 1 జీబీ హై స్పీడ్ డేటా ధర రూ .4 కన్నా తక్కువ చార్జ్ చేస్తుంది.
ఈ కొత్త ప్లాన్ జియో నుండి జియో, ల్యాండ్‌లైన్‌కు ఉచిత ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. ఇది జియో నుండి ఇతర మొబైల్ నెట్వర్క్ లకు 3,000 నిమిషాల వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది.
also read పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో పోకో ఎఫ్2ప్రో స్మార్ట్ ఫోన్...
రోజుకు 3జిబి హై-స్పీడ్ ఆన్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది, తరువాత 64 కేబిపిఎస్ స్పీడ్ పడిపోతుంది. దీనితో పాటు, ఈ ఆఫర్ జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా ఇస్తుంది.
లాక్ డౌన్ పొడిగింపుతో హై-స్పీడ్ డేటా వినియోగం మరింత పెరిగింది, చాలా మంది ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించారు. అలాగే వినోదం కోసం ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ప్రీపెయిడ్ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో జియో ఈ కొత్త త్రైమాసిక వర్క్-ఫ్రమ్-హోమ్ ప్లాన్‌తో ముందుకు తెచ్చింది.
అంతకుముందు, జియో 33% ఎక్కువ వాల్యుతో రూ .2399 వర్క్ ఫ్రమ్ హోం వార్షిక ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2జిబి హై స్పీడ్ ఆన్ లిమిటెడ్ డాటా అందిస్తుంది. 336 రోజుల వాలిడిటీతో రూ .2,121 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 జీబీని జియో అందిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ లలో ఇది ఒకటి.