ఇప్పటి నుంచి ట్విటర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు....ఎలా అంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Jan 10, 2020, 3:53 PM IST

ట్విట్టర్‌లో 6.8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న యుసాకు మేజావా "సోషల్ ఎక్స్పెరిమెంట్" ప్రారంభించాడు, అయితే జనవరి 1న తన పోస్టుకు రీట్వీట్ చేసిన 1,000 మంది ఫాలోవర్స్ కు రూ .64.36 కోట్లు పంచనున్నారు.


జపాన్ బిలియనీర్, ఫ్యాషన్ డిజైనర్ యుసాకు మేజావా తన ట్విట్టర్ఫాలోవర్స్ లో ఉన్న వెయ్యి మందికి 9 మిలియన్ (రూ. 64.36 కోట్లు) పంచనున్నారు, ఇందువల్ల ఉచితంగ డబ్బులు పంచడం ప్రజలలో ఆనందాన్ని పెంచుతాయా లేదా అని చూడటానికి అని అన్నారు.ట్విట్టర్‌లో 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా ఒక "సోషల్ ఎక్స్పెరిమెంట్" ప్రారంభించారు.

also read ఫ్లిప్‌కార్ట్ నుండి కొత్త స్లిమ్ ల్యాప్‌టాప్‌.... ధర ఎంతో తెలుసా...?

Latest Videos

undefined

ఇందులో భాగంగా అతను 1 మిలియన్ యెన్లను ఇవ్వనున్నారు. అందుకు కారణం ఏంటంటే జనవరి 1 తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన 1,000 మంది ఫాలోవర్స్‌కు రూ .64.36 కోట్లు పంచిపెట్టనున్నారు.  1,000 మంది ఫాలోవర్స్‌ లను విజేతలు ఎంపిక చేసి వారికి ఆ డబ్బును పంచనున్నారు.మేజావా ఇటీవల 2023 లో ఎలోన్ మస్క్  స్పేస్‌ఎక్స్‌లో చంద్రుని చుట్టూ ప్రయాణించటానికి మొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగా సైన్ అప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

జపాన్ దేశంలోని ధనవంతులలో ఒకరైన మేజావా, ట్విట్టర్ ఫాలోవర్స్ కు  9 మిలియన్ డాలర్లను బహుమతి  ఇవ్వటం అనేది కేవలం యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (బిఐ) భావనను అర్థం చేసుకోవడమే అని ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ ని అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ ప్రకటించారు. మేజావా ఫాలోవర్స్ నేను ఎంపిక అయితే 18 ఏళ్ల దాటిన  అమెరికన్ యువకుడికి   ప్రతి నెలకు $ 1,000 ఇస్తానని తెలిపాడు.

 
"బేసిక్ ఆదాయం అనేది ప్రభుత్వం ప్రతి నెలా సిటిజెన్స్ కి నిర్ణీత మొత్తాన్ని చెల్లించే ఒక విధానం" అని ఆయన ట్విట్టర్‌లో రాశారు.అతను ఒక ప్రత్యేక నోట్‌లో  "ఈ ప్రచారం ప్రభుత్వం ప్రాథమిక ఆదాయాన్ని అలాగే ఏదైనా ప్రయోజనాలను, రాయితీలను పరిగణనలోకి తీసుకునే సూచన కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక ఆదాయంపై చర్చలు, ప్రయోగాలు జరుగుతున్నప్పుడు, కొన్ని ప్రయోగాత్మక ఫలితాలు కూడా అవసరం".

also read కొత్త ఏడాదిలో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

తాను ఏ రాజకీయ నాయకుడూ, రాజకీయ లీడర్ కానందున ప్రాథమిక ఆదాయం గురించి తాను ఏమీ చేయలేనని ఆయన అన్నారు. ఏదేమైనా, అతని తాజా ప్రయత్నం జపాన్  ఆర్ధిక సంస్కృతిలో చిన్న మార్పులను తీసుకురావడం మాత్రమే.42 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ యుసాకు మేజావా మాట్లాడుతూ "ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో, జీవన వాతావరణం, పని వాతావరణం, ఇంటి వాతావరణం మొదలైన వాటిలో కొత్త సవాళ్లను తీసుకోలేక ఇబ్బందుల్లో చిక్కుకున్న వారు చాలా మంది ఉన్నారని నేను మళ్ళీ తెలుసుకున్నాను.


యుసాకు మేజావా  ప్రజలకు డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు అని, గత సంవత్సరంలో కూడా  అతను తన ట్విట్టర్ ఫాలోవర్స్ లో 100 మందికి 100 మిలియన్ యెన్లను (17 917,000) షెల్ చేశాడు.

click me!