ఫోన్ చార్జ‌ర్‌తో క‌రోనా వైర‌స్ కు చెక్...ఎలా అనుకుంటున్నారా ?

By Sandra Ashok KumarFirst Published Jun 20, 2020, 3:28 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎంతో ధాని బారిన పడి మృతి చెందారు అలగే లక్షల్లో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారతదేశంలో నాలుగు లక్షల చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. అగ్రదేశాలతో సహ అన్నీ ఇతర దేశాలు కరోనా ని అరికట్టేందుకు వాక్సిన్ పై పరిశోధనలు కూడా చేస్తున్నారు. 

ఫోన్ ఛార్జర్ కనెక్ట్ చేయడం ద్వారా కరోనా వైరస్ చంపగలమని ఇజ్రాయెల్ పరిశోధకులు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎంతో ధాని బారిన పడి మృతి చెందారు అలగే లక్షల్లో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భారతదేశంలో నాలుగు లక్షల చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. అగ్రదేశాలతో సహ అన్నీ ఇతర దేశాలు కరోనా ని అరికట్టేందుకు వాక్సిన్ పై పరిశోధనలు కూడా చేస్తున్నారు. తాజాగా హైఫాలోని టెక్నియన్ విశ్వవిద్యాలయంలోని బృందం మొబైల్ ఫోన్ ఛార్జర్‌కు యుఎస్‌బి పోర్ట్‌తో ఫేస్ మాస్క్ అనుసంధానించి కరోనాకు చెక్ పెట్టొచని తెలిపింది.

అది ఎలా అంటే స్మార్ట్ ఫోన్ ఛార్జర్‌కు యుఎస్‌బి పోర్ట్‌తో ఫేస్ మాస్క్ అనుసంధానించి  30 నిమిషాలు వేడి చేయ‌డంతో మాస్క్‌ పై ఊన్న క‌రోనా వైర‌స్ చ‌చ్చిపోతుంది అలాగే ఇది దీంతో క్రిమిసంహార‌క‌మ‌వుతుంది. చార్జ‌ర్‌, కార్బన్ ఫైబర్స్ మాస్క్‌ పొరను 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది.

also read వాట్సాప్‌లో టెక్నికల్ సమస్య.. యూజర్ల తీవ్ర అసంతృప్తి..

70 డిగ్రీల వేడి అంటే కేవ‌లం అర‌గంటపాటు బ‌హిర్గ‌తం చేస్తే క‌రోనా వైర‌స్ చ‌చ్చిపోతుంద‌ని జెరూసలేంలోని  హడస్సా మెడికల్ సెంటర్‌లో అంటు వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ అలోన్ మోసెస్ చెప్పుకొచ్చాడు.

వైర‌స్‌ను తొల‌గిద్దామ‌ని ప‌దే ప‌దే  మాస్క్ వేడి చేయ‌డం వ‌ల్ల పాడువుతుంద‌ని కూడా చెబుతున్నాడు. పరిశోధకులు మార్చి చివరిలో యూ‌ఎస్‌ఏ లో ఫేస్ మాస్క్ కోసం పేటెంట్ సమర్పించారు. దానిని ప్రైవేటు రంగాలతో వాణిజ్యకరించే మార్గాలను పరిశీలిస్తున్నారు.

click me!