వాట్సాప్‌లో టెక్నికల్ సమస్య.. యూజర్ల తీవ్ర అసంతృప్తి..

By Sandra Ashok Kumar  |  First Published Jun 20, 2020, 2:33 PM IST

యోగదారులకు  ‘లాస్ట్ సీన్’తో పాటు, యాప్  సెక్యూరిటి సెట్టింగ్‌లతో వినియోగదారులు టైపింగ్, ఆన్‌లైన్‌లో సమస్యలను ఎదురైనట్టు నివేదించారు. ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అవుట్‌గేజ్ మానిటర్ అయిన డౌన్ డిటెక్టర్, వాట్సాప్ నివేదికలలో 66 శాతం మందికి ఈ సమస్య ఎదురైనట్టు నివేదించింది. 


పాపులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్,  ఫేస్‌బుక్ యజమాన్యంలోని వాట్సాప్ శుక్రవారం సాయంత్రం నుంచి భారతదేశంలో చాలా మందికి వినియోగరదులకు ఒక కొత్త ఎర్రర్ సమస్య తలెత్తింది. వినియోగదారులకు  ‘లాస్ట్ సీన్’తో పాటు, యాప్  సెక్యూరిటి సెట్టింగ్‌లతో వినియోగదారులు టైపింగ్, ఆన్‌లైన్‌లో సమస్యలను ఎదురైనట్టు నివేదించారు.

ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అవుట్‌గేజ్ మానిటర్ అయిన డౌన్ డిటెక్టర్, వాట్సాప్ నివేదికలలో 66 శాతం మందికి ఈ సమస్య ఎదురైనట్టు నివేదించింది. మరో 28 శాతం మంది వినియోగదారులు కనెక్షన్ సమస్యలను ఉన్నట్టు నివేదించారు.

Latest Videos

undefined

ఈ సమస్యను ఆండ్రయిడ్, ఇఒస్ వినియోగదారులు ఎదుర్కొన్నారు. దీంతో చాలామంది వినియోగదారులు ట్విటర్ లో స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మీమ్స్ తో సందడి చేశారు.

డౌన్ డిటెక్టర్ అందించిన సమాచారం ప్రకారం వాట్సాప్ యూజర్లు అప్లికేషన్ గోప్యతా సెట్టింగులలో ఒక బగ్ కారణంగా సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది అని డబల్యూ‌ఏ బీటా ఇన్ఫో ట్వీట్ చేసింది.

also read 

చాలా మంది వినియోగదారులు వాట్సప్ లో తలెత్తిన సమస్యలను స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్‌లతో సమస్యను ఎత్తి చూపారు. ముంబై పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా ఈ విషయంపై ట్వీట్ చేసింది.

ఈ విషయంపై ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ సంఘటనకు మూడు రోజుల ముందు ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో యూసర్లు సమస్యను ఎదుర్కొన్నాయి.

ఇండియా సహా, అమెరికా, యుకె, యూరప్, సింగపూర్ లోని కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులను ఈ సమస్య ప్రభావితం చేసిందని డౌన్ డిటెక్టర్ పేర్కొంది. వాట్సాప్ వెబ్‌కు కొత్తగా అప్ డేట్ డిజైన్ డార్క్ మోడ్, కాలింగ్ ఫీచర్‌లను తీసుకువస్తుందని కొన్ని నివేదికలు సూచించాయి. 
 

click me!