అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ 'లాక్' ప్రారంభం..

By Sandra Ashok Kumar  |  First Published Aug 3, 2020, 5:20 PM IST

భారతీయులకోసం భారతదేశంలో తయారుచేసిన యాప్‌. సాధారణ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు విద్యావంతుల కోసం 'లాక్ క్లాస్‌రూమ్', లైవ్ స్ట్రీమింగ్, వెబ్‌నార్, ఇతర సేవల కోసం 'లాక్ స్టూడియో' ను అందిస్తుంది.


న్యూ ఢీల్లీ : సీనియర్ జర్నలిస్ట్ అనురంజన్  'లాక్' అనే వీడియో కాన్ఫరెన్సింగ్, వెబ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ భారతీయుల కోసం పూర్తిగా భారతదేశంలో తయారు చేసిన యాప్ లాంచ్ చేశారు. భారతీయులకోసం భారతదేశంలో తయారుచేసిన యాప్‌.

సాధారణ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు విద్యావంతుల కోసం 'లాక్ క్లాస్‌రూమ్', లైవ్ స్ట్రీమింగ్, వెబ్‌నార్, ఇతర సేవల కోసం 'లాక్ స్టూడియో' ను అందిస్తుంది.

Latest Videos

undefined

అభివృద్ధిపై లాక్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అనురంజన్ మాట్లాడుతూ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపులో భాగంగా దీన్ని స్థానికుల కోసం స్వదేశంలో రూపొందించామని పేర్కొన్నారు. లాక్ ప్లాట్‌ఫాం మూడు వేర్వేరు పరిష్కారాలను కోసం ఉంది, దీనిని పార్క్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తోంది.

విద్యావేత్తల కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం 'లాక్ క్లాస్‌రూమ్', లాక్ 'ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్' ముఖ్యమైన ఫీచర్ తో వస్తుంది అని పేర్కొన్నారు.

also read గూగుల్ పిక్సెల్ కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. 5జీ మోడల్‌ కూడా త్వరలో విడుదల చేసే చాన్స్‌.. ...


లాక్ ప్రతి కాల్, మల్టీ డివైజ్ లాగిన్ సపోర్ట్  ఆప్షనల్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. సహోద్యోగులతో మెరుగైన సహకారం కోసం వినియోగదారులు, ముఖ్యంగా ఇంటి నుండి పనిచేసేవారు స్క్రీన్‌ను మరొక వైపు షేర్  చేసుకోవచ్చు.

"లాక్ దశలవారీగా ప్రారంభించబడుతోంది, ఇతర భారతీయ డెవలపర్‌ల కోసం ఎపిఐలను కూడా అందిస్తుంది, తద్వారా వారు లాక్ యాప్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వారి స్వంత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అభివృద్ధి చేయవచ్చు" అని గ్రౌండ్ బ్రేకింగ్ వీడియో స్ట్రీమింగ్ టెక్నాలజీలలో సహ వ్యవస్థాపకుడు వరుణ్ గుప్తా అన్నారు.

పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యా సంస్థలకు ప్రత్యేక రాయితీ ప్యాకేజీలతో నెలకు 250 నుండి 1500 రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా విధించిన ప్రయాణ పరిమితులు, ఇతర చర్యలు వెబ్ యాప్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడటంతో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ వ్యాపారం పెరుగుతుంది.

click me!