ఐటి, బిపిఓ కంపెనీల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రోం హోం పొడిగింపు..

By Sandra Ashok KumarFirst Published Jul 22, 2020, 2:56 PM IST
Highlights

జూలై 31 తో ముగుస్తుంది అనుకున్న వర్క్ ఫ్రోం హోం ఆర్డర్ తాజాగా మరోసారి పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రముఖ కంపెనీలతో సహ ఐ‌టి సంస్థలు అన్నీ వర్క్ ఫ్రోం హోం ప్రకటించాయి. 

వర్క్ ఫ్రోం హోం చేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూలై 31 తో ముగుస్తుంది అనుకున్న వర్క్ ఫ్రోం హోం ఆర్డర్ తాజాగా మరోసారి పొడిగించింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రముఖ కంపెనీలతో సహ ఐ‌టి సంస్థలు అన్నీ వర్క్ ఫ్రోం హోం ప్రకటించాయి. ఐటి, బిపిఓ కంపెనీలకు  వర్క్ ఫ్రోం హోం కోసం కనెక్టివిటీ నిబంధనలను ప్రభుత్వం మంగళవారం డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

వర్క్ ఫ్రోం హోం చేసే ఆర్డర్ జూలై 31 తో ముగుస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విభాగం (డిఓటి) నుంచి వచ్చిన ట్వీట్ ద్వారా ఈ ప్రకటన వెల్లడైంది.

also read 

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా కొనసాగుతున్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రోం హోంని సులభతరం చేయడానికి 2020 డిసెంబర్ 31 వరకు ఐ‌టి సంస్థలకు నిబంధనలు, షరతుల సడలింపులను డి‌ఓ‌టి విస్తరించింది "అని ట్వీట్ లో తెలిపింది.

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి భారతదేశం కఠినమైన లాక్ డౌన్ విధించినప్పటి నుండి ఏప్రిల్‌లో వర్క్ ఫ్రోం హోం నిబంధనల నుండి సడలింపును డి‌ఓ‌టి ప్రకటించింది, తరువాత ఆ తేదీని జూలై 31 వరకు పొడిగించింది.

కొన్ని టెక్ సంస్థలు ఉద్యోగుల కోసం ఆఫీస్ సంబంధిత పరికరాల కొనుగోలుకు సహాయార్ధం కోసం వేతనంతో పాటు సహకారం కూడా అందించింది. 

 

click me!