గ్రామాల్లోనూ పెరుగుతున్నా నెటిజన్లు.. నెట్ యూజర్లలో 14% చిన్నారులే ..

By Sandra Ashok Kumar  |  First Published May 7, 2020, 11:49 AM IST

భారతదేశంలో గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఇంటర్నెట్ యూజర్లు 50.4 కోట్ల మంది ఉన్నారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వెల్లడించింది. వారిలో 14 శాతం మంది బాలలే ఉన్నారని పేర్కొంది. 
 


న్యూఢిల్లీ: భారత్‌లో చురుగ్గా ఇంటర్నెట్‌ వాడుతున్న వారు 50.4 కోట్ల మంది ఉన్నారని ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) తెలిపింది. వీరిలో 14 శాతం మంది 5-11 మధ్య ఏళ్ల పిల్లలు తమ కుటుంబ సభ్యుల డివైజ్‌లపై ఇంటర్నెట్ పొందుతున్నారని ఐఏఎంఏఐ తన ‘డిజిటల్ ఇండియా’ నివేదికలో వెల్లడించింది. 

మొత్తం వినియోగదార్లలో 43.3 కోట్ల మంది 12 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలవారని, 7.1 కోట్ల మంది 5-11 ఏళ్ల లోపు వారని ఐఎంఐఏఐ పేర్కొంది. 70 శాతం మంది చురుగ్గా ఇంటర్నెట్ వాడతారని తేలింది. పట్టణాల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది కనీసం వారానికి ఒకసారి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. 

Latest Videos

గతేడాది మార్చి నుంచి గ్రామాల్లో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య మూడు కోట్లకు పెరిగింది. గతేడాది నవంబర్ నెలలో 2.6 కోట్ల మంది మహిళలు ఇంటర్నెట్ యూజర్లుగా అవతరించారని ఐఏఎంఐఏ వెల్లడించింది. 

also read లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఈ-కామర్స్ సైట్లలో ఎక్కువగా వాటికోసమే సెర్చింగ్.. వెల్లడించిన ఫ్లిప్‌కార్ట్

సెలవు దినాలు, ఆదివారాల్లో ఇంటర్నెట్ వాడకం గంటకు పైగా ఉంటున్నదని, పట్టణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అని ఐఏఎంఏఐ వివరించింది. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 21 శాతం పెరుగుదల నమోదైంది. నూతన ఇంటర్నెట్ వినియోగదారుల్లో తొమ్మిది శాతానికి పైగా పురుషులు ఉన్నారు.

మహిళా నెట్ యూజర్ల కంటే గ్రామీణ ఇంటర్నెట్ యూజర్లు రెట్టింపుకు పైగా ఉంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అత్యధికులు మొబైల్ ఫోన్లలో  ఇంటర్నెట్‌ వాడుతున్నారని ఐఏఎంఏఐ డిజిటల్ ఇండియా నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్లపై తక్కువ ధరలకే డేటా అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వాడకం పెరిగిందని తెలిపింది. 
 

click me!