మీ జీ-మెయిల్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఈ ట్రిక్స్ ఉపయోగించండి !

By Sandra Ashok KumarFirst Published Aug 31, 2020, 10:40 AM IST
Highlights

తరచూ సోషల్ మీడియా,  జీ-మెయిల్ అక్కౌంట్ వాడేవారు ఒకేసారి పాస్ వర్డ్  ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటుంటారు. కానీ కొన్ని సంధర్బల్లో జీ-మెయిల్ పాస్ వర్డ్ ఒకోసారి గుర్తుండకపోవచ్చు. 

హైదరాబాద్ : సాధారణంగా చాలా మందికి ఇలాంటి సమస్య ఎప్పుడొకప్పుడు ఏదో ఒకరోజు ఎదురయ్యే ఉంటుంది. తరచూ సోషల్ మీడియా,  జీ-మెయిల్ అక్కౌంట్ వాడేవారు ఒకేసారి పాస్ వర్డ్  ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటుంటారు. కానీ కొన్ని సంధర్బల్లో జీ-మెయిల్ పాస్ వర్డ్ ఒకోసారి గుర్తుండకపోవచ్చు.

ఆఫీస్ పనులకు, పర్సనల్ పనులకు జీ-మెయిల్ ఉపయోగిస్తుంటాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడాలంటే  జీ-మెయిల్ అక్కౌంట్ తప్పనిసరి ఉండాల్సిందే. కాబట్టి జీ మెయిల్ పాస్ వర్డ్ ను మరచిపోవడం కొందరికి సమస్యగా ఉంటుంది. మీరు మీ జీ మెయిల్ పాస్ వర్డ్ ను మరచిపోతే సింపుల్ గా ఈ ట్రిక్స్ ఉపయోగించండి.. 

1 - మొదట మీ  గూగుల్ అకౌంట్ లేదా జీ మెయిల్ పేజీని ఓపెన్ చేయండి.

2- ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'ఫర్గెట్ పాస్ వర్డ్ 'ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3 - మీకు గుర్తు ఉన్న చివరి పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు పాస్ వర్డ్ గుర్తులేకపోతే, మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఆప్షన్ పై క్లిక్ చేయండి.

also read  

4 - మీ జీమెయిల్ అక్కౌంట్ కి లింక్ చేసిన ఫోన్ నంబర్ కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

 5 - మీకు ఫోన్ నంబర్ లేకపోతే, గూగుల్ మీ ఇ-మెయిల్ కు ఒక వెరిఫికేషన్ కోడ్ ని పంపుతుంది.

మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఆప్షన్ ఎంచుకోండి.

 6 - ఇక్కడ గూగుల్ మీ ఇ-మెయిల్ కు బదులు ఆల్టర్నేటివ్ ఇ-మెయిల్ ఐడి ని అడుగుతుంది.

 7- ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇ-మెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.

8 - రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ వర్డ్ ఉపయోగించి మీ జీ మెయిల్ కు లాగిన్ అవ్వండి. 

click me!