ఆండ్రాయిడ్ యూజర్లు అలర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ వెంటనే డిలిట్ చేయండి..

By Sandra Ashok KumarFirst Published Sep 16, 2020, 2:58 PM IST
Highlights

జూలై నెలలో గూగుల్ ప్లే స్టోర్ జోకర్ అనే మాల్వేర్ ఉన్న 11 యాప్స్ ని తొలగించింది. తాజాగా పరిశోధకులు ప్రమాదకరమైన మాల్వేర్ ఉన్న మరో ఆరు యాప్స్ ని గుర్తించారు. గుర్తించిన ఈ ఆరు యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ తీసివేసింది. ఇక పై ఆ యాప్స్ కొత్త డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఉండదు.

స్మార్ట్ ఫోన్ వాడేవారికి గూగుల్ ప్లే స్టోర్ ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ అందరికీ ఉపయోగపడవు. ఎవరికి ఎలాంటి యాప్స్ అవసరం ఉంటాయో వాటిని మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని  డేంజరస్ యాప్స్ ద్వారా మీకు వ్యక్తి గత డాటా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

ఇలాంటి డేంజరస్ యాప్స్ ని వివిధ సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించి గూగుల్‌తో పాటు యూజర్లను అప్రమత్తం చేస్తుంటాయి.

జూలై నెలలో గూగుల్ ప్లే స్టోర్ జోకర్ అనే మాల్వేర్ ఉన్న 11 యాప్స్ ని తొలగించింది. తాజాగా పరిశోధకులు ప్రమాదకరమైన మాల్వేర్ ఉన్న మరో ఆరు యాప్స్ ని గుర్తించారు.

 గుర్తించిన ఈ ఆరు యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ తీసివేసింది. ఇక పై ఆ యాప్స్ కొత్త డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఉండదు. ఇప్పటికే ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేసిన వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌ల నుండి వాటిని తొలగించాలని హెచ్చరించింది.

సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రెడియో రిపోర్ట్ ఈ ఆరు యాప్స్ గూగుల్ స్టోర్ నుండి తొలగించడానికి ముందే దాదాపు 2,00,000 డౌన్‌లోడ్లు ఉన్నాయని పేర్కొంది.

also read 

జూలై నెలలో గూగుల్ ప్లే స్టోర్ లో జోకర్ మాల్వేర్ ను చెక్ పాయింట్ పరిశోధకులు కనుగొన్నరు. ఈ జోకర్ మాల్వేర్ తో కూడిన 11 యాప్స్ ని పరిశోధకులు గుర్తించగలిగారు. జోకర్ మాల్వేర్ ఉన్న యాప్స్ లిస్ట్:


com.imagecompress.android

com.relax.relaxation.androidsms

com.file.recovefiles

com.training.memorygame

Push Message- Texting & SMS

Fingertip GameBox

com.contact.withme.texts

com.cheery.message.sendsms (two different instances)

com.LPlocker.lockapps

Safety AppLock

Emoji Wallpaper

com.hmvoice.friendsms

com.peason.lovinglovemessage

com.remindme.alram

Convenient Scanner 2

Separate Doc Scanner

 ఈ యాప్స్ యూజర్ల ప్రమేయం లేకుండా వారి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్‌తో సబ్‌స్క్రిప్షన్స్ చేస్తున్నట్టు పరిశోధనలో తేలింది. ఈ యాప్స్ ఒకవేళ వారి స్మార్ట్ ఫోన్ లో ఉందో లేదో తనిఖీ చేసి వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కౌంటర్ పాయింట్ పరిశోధకులు సూచిస్తున్నారు.

ఏదైనా సబ్‌స్క్రైబ్స్  కోసం చెక్ చేయడానికి వినియోగదారులు వారి క్రెడిట్ కార్డ్ బిల్లు చూసుకోవాలి అని తెలిపారు. అందులో ఏవైనా అనుకోని సబ్‌స్క్రైబ్స్ ఉంటే భవిష్యత్తులో వాటి నుండి సురక్షితంగా ఉండటానికి సబ్‌స్క్రైబ్స్ తొలగించవచ్చు.

మాల్వేర్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశించడానికి కారణమైన వాటిని  గుర్తించడం చాలా క్లిష్టమైనది కాబట్టి, కొన్ని యాప్స్ ద్వారా ఇది తిరిగి వస్తుందని భావిస్తున్నారు.  
 

click me!