గూగుల్ మ్యాప్స్‌లో మీ కార్ పార్కింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

By Sandra Ashok Kumar  |  First Published Oct 5, 2020, 5:31 PM IST

షాపింగ్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ ప్రాంతంలో కారును పార్కింగ్ చేసిన తర్వాత చాలా సార్లు తిరిగి వచ్చేసరికి కారును పార్కింగ్ స్థలంలో ఎక్కడ పార్క్ చేశామో మనం తరచుగా మరచిపోతుంటాము. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే ఈ వార్త మీకోసమే. 


గూగుల్ మ్యాప్స్‌లో కార్ పార్కింగ్ లొకేషన్ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ ప్రాంతంలో కారును పార్కింగ్ చేసిన తర్వాత చాలా సార్లు తిరిగి వచ్చేసరికి కారును పార్కింగ్ స్థలంలో ఎక్కడ పార్క్ చేశామో మనం తరచుగా మరచిపోతుంటాము.

మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే ఈ వార్త మీకోసమే. ఈ రోజు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీరు మీ కారును పార్కింగ్ స్థలంలో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు దాని గురించి పూర్తి సమాచారం మీకోసం.

Latest Videos

కారును పార్కింగ్ స్థలంలో ఉంచిన తరువాత మీ స్మార్ట్ ఫోన్ లో మొదట గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి లొకేషన్ కోసం జి‌పి‌ఎస్ ఆన్ చేయండి.

also read గూగుల్ ప్లే స్టోర్‌కి పోటీగా పేటీఎం కొత్త యాప్ స్టోర్‌.. ...

1) గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తరువాత మీరు మ్యాప్‌లో మీ లొకేషన్ చూస్తారు. దానిపై నొక్కిన తర్వాత మీకు మూడు ఆప్షన్స్ మీ ముందు కనిపిస్తాయి.
2) మొదట నియర్ మై ప్లేసెస్, మీ ప్రదేశాన్ని షేర్ చేయండి, మీ పార్కింగ్‌ లొకేషన్  సేవ్ చేయండి
3) మీరు సేవ్ మై పార్కింగ్ పై క్లిక్ చేసిన వెంటనే పార్కింగ్ లొకేషన్ సేవ్ చేయబడినట్లు మీరు చూస్తారు. అంతేకాదు మీరు వాహనం పార్కింగ్ ను ఎంతకాలం చేసారో కూడా చూస్తారు.

షాపింగ్ నుండి తిరిగి వచ్చిన తరువాత, కార్ పార్కింగ్‌లో మీ కారు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే, మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మీరు గూగుల్ మ్యాప్స్‌లో మీరు కారును ఆపి ఉంచిన లొకేషన్ చూస్తారు. డైరెక్షన్స్ కోసం సెర్చ్ పై క్లిక్ చేసి ఇక్కడ మీకు పార్కింగ్ లొకేషన్  ఆప్షన్స్ చూపిస్తుంది దానిపై నొక్కండి, ఆపై డైరెక్షన్స్ పై క్లిక్ చేయండి.

ఈ ఫీచర్ ఉపయోగించే ముందు దీనిని ఎవరు ఉపయోగించవచ్చో మీరు తెలుసుకోవాలి. ఈ ఫీచర్ ఆండ్రోయిడ్ మార్ష్ మల్లో లేదా అంతకంటే ఎక్కువ ఓఎస్ అప్ డేట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ లో పని చేస్తుంది. ఆపిల్ వినియోగదారులు ఐ‌ఓ‌ఎస్ 10 లేదా అంతకంటే ఎక్కువ అప్ డేట్ ఉంటే సపోర్ట్ చేస్తుంది.
 

click me!