రియల్-మనీ గేమింగ్‌పై మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సెప్టెంబర్ 18న గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్ తాత్కాలికంగా తొలగించింది. ఈ తొలగింపు కారణంగా పేటీఎం స్టోర్‌ను తీసుకొచ్చింది.
బెంగళూరు: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీగా డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం భారతీయ డెవలపర్‌లకు సపోర్ట్ గా ఒక చిన్నయాప్ స్టోర్‌ను ప్రారంభించింది. రియల్-మనీ గేమింగ్‌పై మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సెప్టెంబర్ 18న గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్ తాత్కాలికంగా తొలగించింది.
ఈ తొలగింపు కారణంగా పేటీఎం స్టోర్‌ను తీసుకొచ్చింది. ఈ మినీ యాప్ స్టోర్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఉపయోగించుకోవచ్చు. నేరుగా మొబైల్ వెబ్‌సైట్ ద్వారా యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని, ఇందువల్ల కోట్లాది మంది యూజర్ల డేటా ప్రైవసీకి ముప్పు ఉండదని పేటీఎం పేర్కొంది.
డెకాథ్లాన్, ఓలా, రాపిడో, నెట్‌మెడ్స్, 1 ఎంజి, డొమినోస్ పిజ్జా, ఫ్రెష్‌మెను, నోబ్రోకర్ సహా 300కి పైగా యాప్‌లు పేటిఎం యాప్ స్టోర్‌లో చేరినట్లు కంపెనీ తెలిపింది. గత వారం పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ, హర్షిల్ మాథుర్ మరో 50 మంది వ్యవస్థాపకులతో కలిసి గూగుల్ కు పోటీగా ఇండియన్ యాప్ స్టోర్ నిర్మించే అవకాశం పై చర్చించారు.
also read
గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేస్తే 30 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ తమ మినీ యాప్ స్టోర్ పేమెంట్ గేట్ ద్వారా యాప్స్ లిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సేవలను చార్జీలు లేకుండా అందించనున్నట్టు పేటీఎం తెలిపింది.
పేటీఎం మినీ యాప్ స్టోర్‌లో యాప్స్ లిస్ట్ చేసిన డెవలపర్లు పేటీఎం వాలెట్, పేమెంట్స్ బ్యాంకింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు సేవలను తమ యాప్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చని వెల్లడించింది. అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో మొబైల్ సర్వీస్ యాప్ స్టోర్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ యాప్స్ ఉన్నాయి.