కరోనా హాట్‌స్పాట్‌లను చూపించే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్..

By Sandra Ashok KumarFirst Published Sep 26, 2020, 6:52 PM IST
Highlights

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైన ఉన్న లేయర్స్ ఫీచర్‌లో కొత్త "కోవిడ్-19 " ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా తాజా 7 రోజులలో సగటు నమోదయ్యే కేసులను ఉపయోగించి మ్యాప్‌లను మెరుగుపరుస్తుంది.

కోవిడ్-19 కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రదేశాలను మ్యాప్ చేసే కలర్ కోడింగ్‌తో గూగుల్ ఫ్రీ మ్యాపింగ్ సర్వీస్ ను అప్‌డేట్ చేస్తోందని సెర్చ్ ఇంజన్ గూగుల్ గురువారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైన ఉన్న లేయర్స్ ఫీచర్‌లో కొత్త "కోవిడ్-19 " ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా తాజా 7 రోజులలో సగటు నమోదయ్యే కేసులను ఉపయోగించి మ్యాప్‌లను మెరుగుపరుస్తుంది.

మ్యాప్స్ ప్రొడక్ట్ మేనేజర్ సుజోయ్ బెనర్జీ ప్రకారం ఒక నిర్దిష్ట ప్రదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుదల లేదా తగ్గుదల సమాచారాన్ని  వినియోగదారులకు తెలియజేస్తుంది.

 "ఒక ప్రాంతంలో కోవిడ్-19 కేసుల గురించి క్లిష్టమైన సమాచారాన్ని అందించడానికి దీనిని రూపొందించారు, అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో దాని అదనంగా కోవిడ్-19 గురించి మరింత సమాచారం తీసుకోవచ్చు" అని బెనర్జీ చెప్పారు.

also read ఇన్‌స్టాగ్రామ్‌లాగానే లింక్డ్ఇన్ లో అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు.. ...

కోవిడ్-19 కోసం ఉపయోగించిన డేటా బాల్టిమోర్ ఆధారిత జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్, న్యూయార్క్ టైమ్స్, వికీపీడియాతో సహా ఇతర మూలాల నుండి వచ్చింది, ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖల వంటి ప్రజారోగ్య సంస్థల నుండి సమాచారాన్ని పొందుతాయని బెనర్జీ తెలిపారు.

ఆపిల్ లేదా గూగుల్-బ్యాక్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా నడిచే మొబైల్ డివైజెస్ కోసం రూపొందించిన మ్యాప్ యాప్ వెర్షన్లలో కోవిడ్-19 లేయర్ ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నట్లు కాలిఫోర్నియాకు చెందిన సంస్థ తెలిపింది.

కరోనా మహమ్మారి వ్యాపించకుండా గూగుల్ మ్యాప్స్ ఇప్పటికే ప్రజా రవాణా రద్దీగా ఉన్నప్పుడు వినియోగదారులకు తెలియజేయడం వంటి టూల్స్ కలిగి ఉంది.

"ఈ రోజుల్లో బయట తిరగడం మరింత కష్టంగా ఉన్నప్పటికీ, గూగుల్ మ్యాప్స్ ఫీచర్లు మీరు సాధ్యమైనంత సురక్షితంగా, సమర్ధవంతంగా ఉండాల్సిన చోటుని తెలియజేయడానికి మీకు సహాయం చేస్తాయని అనుకుంటున్నం" అని బెనర్జీ చెప్పారు.
 

click me!