ఇన్‌స్టాగ్రామ్‌లాగానే లింక్డ్ఇన్ లో అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు..

By Sandra Ashok KumarFirst Published Sep 26, 2020, 5:56 PM IST
Highlights

 తాజాగా లింక్డ్ఇన్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. స్టోరీస్, వీడియో కాలింగ్, మెరుగైన సర్చ్ ఎక్స్ పిరియేన్స్ , రీడిజైన్ లో భాగంగా మెసేజెస్ ఎడిట్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది.
 

మైక్రోసాఫ్ట్ యజమాన్యంలోని లింక్డ్ఇన్ అనేది ఉపాధి-ఆధారిత ఆన్‌లైన్ సర్వీస్, లింక్డ్ఇన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిని మే 5, 2003న ప్రారంభించారు. తాజాగా లింక్డ్ఇన్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. స్టోరీస్, వీడియో కాలింగ్, మెరుగైన సర్చ్ ఎక్స్ పిరియేన్స్ , రీడిజైన్ లో భాగంగా మెసేజెస్ ఎడిట్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది.

త్వరలో డార్క్ మోడ్ ఆప్షన్ కూడా రాబోతుంది. నాలుగు సంవత్సరాల తరువాత లింక్డ్ఇన్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా సులభంగా నావిగేషన్, మెరుగైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది.

ఇప్పటికే కొన్ని ఫీచర్లను కొన్ని దేశాలకు అందుబాటులోకి తెచ్చింది. రాబోయే కొద్ది నెలల్లో కొత్త ఫీచర్లను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది.

లింక్డ్ఇన్ బ్లాగ్ పోస్ట్ ద్వారా కొత్త ఫీచర్లను ప్రకటించింది. చాట్ నుండి వీడియో కాల్‌లకు మార్చడం సులభం అని లింక్డ్‌ఇన్ తెలిపింది. ఈ ఫీచర్ ఉపయోగించడానికి మీరు మెసేజ్ టైప్ చేసే టెక్స్ట్ బాక్స్ పక్కన ఉన్న వీడియో కాల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

also read 

ఈ ఫీచర్స్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, యుఎఇ, యు.ఎస్ లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది, అయితే త్వరలో ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించనుంది.

స్టోరీస్ పోస్ట్ చేయడానికి వినియోగదారులు లింక్డ్ఇన్ యాప్ లో వారి ఫోటో సర్కిల్‌ను టచ్ చేసి (ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ ఫీచర్ మాదిరిగానే), ఆపై కెమెరాను ఓపెన్ చేయడానికి ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి.

యాప్ నుండి నేరుగా వీడియోను రికార్డ్ చేయవచ్చు లేదా గ్యాలరీ నుండి అప్‌లోడ్ చేయవచ్చు (వీడియో 20 సెకన్ల వరకు ఉంటుంది). యూజర్లు స్టోరీతో పాటు టెక్స్ట్, స్టిక్కర్లను జోడించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లాగానే ఇతరులను కూడా ట్యాగ్ చేయవచ్చు. ఇవే కాకుండా మరెన్నో అదనపు ఫీచర్స్ కూడా జోడించింది.
 

click me!