గూగుల్ కొత్త ప్రొడక్ట్‌.. అంచనాలు పెంచుతున్న టీజర్‌ వీడియో?!

By Sandra Ashok KumarFirst Published Jul 13, 2020, 3:03 PM IST
Highlights

సెర్చింజన్ గూగుల్ సోమవారం న్యూ ప్రొడక్ట్‌ను విడుదల చేయనున్నది. దీనిపై గూగుల్ చేసిన వీడియో ట్వీట్​ ఇప్పుడు దాని​పై అంచనాలు పెంచుతోంది. హోం స్పీకర్ లాంచ్ చేస్తారని తెలుస్తోంది.
 

న్యూఢిల్లీ: సినిమా విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లను విడుదల చేయడం చిత్ర పరిశ్రమకు అలవాటు. ఏదైనా వస్తువు మార్కెటింగ్ కోసం పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనలు జారీ చేయడం వ్యాపార సంస్థలకు ఆనవాయితీ. అలాగే 'గూగుల్ 'డా తన ఉత్పత్తులను విపణిలోకి తీసుకొచ్చేటప్పుడు వినూత్నంగా పబ్లిసిటీ చేస్తుంటుంది. 

సెర్చింజన్ గూగుల్ సోమవారం కొత్త ప్రొడక్ట్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన టీజర్‌ వీడియోను రూపొందించింది. ఇందులో స్టార్‌ కమెడియన్‌ ఫ్రెడ్‌ ఆర్మిసెన్‌ సరదాగా యోగా చేస్తున్నట్లు నాలుగు సెకన్ల నిడివి కలిగిన వీడియోను విడుదల చేసింది.

'ఈ సోమవారం ఏదో ప్రత్యేకత రాబోతోంది. గట్టిగా శ్వాస తీసుకోండి. సిద్ధంగా ఉండండి' అంటూ గూగుల్‌ తన వీడియోకు వ్యాఖ్యను జోడించింది. దీంతో ఏ ప్రొడక్ట్‌ విడుదల చేయబోతున్నదీ అనేదానిపై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. 

ఈ సందర్భంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రత్యేకంగా మాట్లాడ నున్నారు. గూగుల్‌ విడుదల చేయబోయే ఉత్పత్తి ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మార్కెట్లోకి కొత్త నెస్ట్‌ స్మార్ట్‌ స్పీకర్‌ను లాంచ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు స్మార్ట్‌ వాచ్‌ అధికారిక ఫొటో, వీడియోను విడుదల చేసింది.

also read ట్రిపుల్ రియర్ కెమెరాతో మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. ...

2016లో గూగుల్‌ నుంచి వచ్చిన హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్‌ కంటే ఈ కొత్త ప్రొడక్ట్‌ విజయవంతం కాగలదని సంస్థ భావిస్తోంది. దీనికి యూఎస్‌, జపాన్‌లో రెగ్యులేటరీ అనుమతులను పొందినట్లు తెలిసింది. సోమవారం దీనినే ప్రకటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.

నెక్ట్స్‌ జనరేషన్‌ హోమ్‌ స్పీకర్‌ ధర దాదాపు దాదాపు రూ.15వేలు (200 డాలర్లు) ఉండొచ్చు. ఈ స్పీకర్‌కు 'ప్రిన్స్‌'అని పేరు పెట్టినట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్‌ గురించి గూగుల్‌ ప్రకటించకపోతే.. టెక్‌ నిపుణులు మరోలా ఆలోచిస్తున్నారు. 

గూగుల్‌ అసిస్టెంట్‌కు కొంత ఉపశమనం కల్పించేలా నూతన ఫీచర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించి కొత్త హార్డ్‌వేర్‌ ప్రకటనా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
 

click me!