ఈ రోజు నుండి గూగుల్ లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది. ఆటొ డిలెట్ ఆప్షన్ ద్వారా దీనిని 18 నెలలకు సెట్ చేయబడింది. యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ ఆటొ-డిలెట్ ఫీచర్ కొత్త అక్కౌంట్ యుసర్లకు 18 నెలల వరకు డిఫాల్ట్ గా ఉంటుంది."మీరు యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ డేటాను మాన్యువాల్ గా డిలెట్ చేయడానికి బదులు 18 నెలల తర్వాత ఆటొమాటిక్ గా హిస్టరి తొలగిపోతుంది.
గూగుల్ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఆల్ఫాబెట్, గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ యూసర్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక కొత్త ఫీచర్ ప్రకటించారు.ఈ రోజు నుండి గూగుల్ లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది.
ఆటొ డిలెట్ ఆప్షన్ ద్వారా దీనిని 18 నెలలకు సెట్ చేయబడింది. యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ ఆటొ-డిలెట్ ఫీచర్ కొత్త అక్కౌంట్ యుసర్లకు 18 నెలల వరకు డిఫాల్ట్ గా ఉంటుంది."మీరు యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ డేటాను మాన్యువాల్ గా డిలెట్ చేయడానికి బదులు 18 నెలల తర్వాత ఆటొమాటిక్ గా హిస్టరి తొలగిపోతుంది.
undefined
కావాలనుకుంటె మీరు ఎప్పుడైనా ఈ సెట్టింగులను ఆపివేయవచ్చు లేదా మీ ఆటో-డిలీట్ ఆప్షన్ మార్చుకోవచ్చు" అని గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు.
గూగుల్ గత సంవత్సరంలో ఆటో-డిలీట్ కంట్రోల్ ను ప్రవేశపెట్టింది. వారు ఎంచుకునే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి.
గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలుపెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని, పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ- మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని పిచాయ్ చెప్పారు.
also read
మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటె మీ యూట్యూబ్ హిస్టరీ మొదటిసారి ఆన్ చేస్తే అందులో ఆటొ-డిలెట్ ఆప్షన్ డిఫాల్ట్‌గా 36 నెలలకు సెట్ చేసి ఉంటుంది. ప్రస్తుత వినియోగదారులు కూడా 3 లేదా 18 నెలల ఆటో-డిలీట్ ఆప్షన్ఎంచుకోవచ్చు.
ఈ ఆటోమెటిక్ డిలిట్ ఆప్షన్ జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌కు వర్తించదని సుందర్ పిచాయ్ వెల్లడించారు. త్వరలో గూగుల్ లో మరో ఫీచర్ కనిపించనుంది. మీరు ఎపుడైనా మీ గూగుల్ అకౌంట్లోకి సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు "గూగుల్ సెక్యూరిటి చెక్", "మై గూగుల్ అక్కౌంట్ సెక్యూర్ ?" అనే రెండు సెక్యూరిటి సెట్టింగ్‌లను చూపుతుంది కావాలంటే మీరు వాటిని సులభంగా రివ్యూ చేయవచ్చు లేదా అడ్జస్ట్ చేయవచ్చు.
"సర్చ్ , మ్యాప్స్, యూట్యూబ్‌లోని మీ ప్రొఫైల్ పిక్చర్‌పై ఎక్కువసేపు నొక్కడం ద్వారా ఇన్ కాగ్నిటివ్ మోడ్‌ను యాక్సెస్ చేయడానికి కూడా మేము సులభం చేస్తున్నాము" అని పిచాయ్ చెప్పారు. ప్రస్తుతం ఐఓఎస్ యూసర్ల కోసం గూగుల్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
త్వరలో ఆండ్రోయిడ్, ఇతర యాప్ లలో అందుబాటులోకి రానుంది. ప్రతి సంవత్సరం 200 మిలియన్లకు పైగా ప్రజలు సెక్యూరిటి చెక్ చేస్తున్నరని 100 మిలియన్లకు పైగా ప్రజలు పాస్ వర్డ్ చెక్ అప్ ఉపయోగించారు అని పిచాయ్ చెప్పారు.