ఆపిల్ తొలి 5జి స్మార్ట్ ఫోన్... లాంచ్ ఎపుడంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jun 25, 2020, 03:11 PM IST
ఆపిల్ తొలి 5జి స్మార్ట్ ఫోన్... లాంచ్ ఎపుడంటే ?

సారాంశం

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020  కార్యక్రమం సోమవారం రోజున జరిగింది. ఈ నేపథ్యంలో అంచనాల మధ్య ఆపిల్ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్  ఐఫోన్ 12కు సంబంధించి అంచనాలపై వార్తలు మరోసారి  హల్ చల్ చేస్తున్నాయి. 

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 12కి లాంచ్ కి ఇంకా నెలలు మాత్రమే ఉంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020  కార్యక్రమం సోమవారం రోజున జరిగింది. ఈ నేపథ్యంలో అంచనాల మధ్య ఆపిల్ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్  ఐఫోన్ 12కు సంబంధించి అంచనాలపై వార్తలు మరోసారి  హల్ చల్ చేస్తున్నాయి.

ఐఫోన్ కు సంబంధించిన తాజా డమ్మీ ఫోటోలు ఆసక్తిరంగా మారాయి. దాదాపు ఇదే ఫైనల్ డిజైన్ కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా లికైన సమాచారం ప్రకారం 5.4, 6.1, 6.7 ఇంచ్‌ల భారీ డిస్‌ప్లేతో ఐఫోన్ 12ను లాంచ్ చేయనుంది.  ట్రిపుల్  రియార్ కెమెరాలతో దీన్ని తీసుకురానున్నట్టు భావిస్తున్నారు.

also read వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్: త్వరలో తక్కువ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. ...

5జీ నెట్‌వ‌ర్క్ టెక్నాల‌జీ స‌పోర్ట్, నాచ్‌లెస్ డిస్‌ప్లేతో ఐఫోన్12కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ జూన్ 22 సోమవారం రోజున రాత్రి ప్రారంభమవుతుంది.

ప్రతి సమవత్సరంలాగే సెప్టెంబ‌ర్‌లో ఐఫోన్ 12ను విడుద‌ల‌ చేసేందుకు మొబైల్ దిగ్గ‌జ సంస్థ ఆపిల్ స‌న్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐఫోన్‌లలోని మూడు వేరు వేరు సైజుల డిస్ ప్లేతో ఒకే విధమైన కెమెరాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 12 లో రింగర్ స్విచ్, సిమ్ కార్డ్ ట్రే, ఎడమవైపు అంచున ఉన్న వాల్యూమ్ బటన్లు ఉంటాయి, కుడి వైపు అంచు పవర్ బటన్‌ పొందుతుంది. 

PREV
click me!

Recommended Stories

Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
2026 AI Impact : ఎవరి ఉద్యోగం సేఫ్.. ఎవరిది డేంజర్? నిపుణుల విశ్లేషణ ఇదే !