మద్యం హోం డెలివరీ చేయనున్న ఫ్లిప్‌కార్ట్.. స్టార్టప్ డియాజియోతో భాగస్వామ్యం..

By Sandra Ashok KumarFirst Published Aug 17, 2020, 4:02 PM IST
Highlights

ఐడబ్ల్యుఎస్ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలిసిస్ అంచనాల ప్రకారం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారతదేశంలో మద్యం పంపిణీ చేయాలనే 27.2 బిలియన్ డాలర్ల విలువైన ఆల్కహాల్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సాహసోపేతమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. 

న్యూ ఢీల్లీ: వాల్ మార్ట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ రెండు  ఇండియాలో మద్యం సరఫరా చేయడానికి స్టార్టప్ డియాజియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది.  ఐడబ్ల్యుఎస్ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలిసిస్ అంచనాల ప్రకారం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారతదేశంలో మద్యం పంపిణీ చేయాలనే 27.2 బిలియన్ డాలర్ల విలువైన ఆల్కహాల్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సాహసోపేతమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.

ఆల్కహాల్ హోమ్ డెలివరీ మొబైల్ అప్లికేషన్ డియాజియో-సపోర్టెడ్ హిప్ బార్ సాంకేతిక సేవా ప్రదాతగా ఫ్లిప్‌కార్ట్ సంబంధం కలిగి ఉండవచ్చని పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.

also read మాకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు: ఫేస్‌బుక్ ...

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లు ఈ-కామర్స్ దిగ్గజం ప్లాట్‌ఫామ్‌లపై హిప్‌బార్  యాప్ యాక్సెస్ చేయడానికి అనుమతించింది. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లు వారికి నచ్చిన మద్యం ఆర్డర్‌లను చేసుకోవచ్చు. రిటైల్ అవుట్‌లెట్ల నుండి మద్యం సేకరించిన తర్వాత హిప్‌బార్ పంపిణీ చేస్తుంది.

హిప్ బార్‌లో డియాజియోకు 26 శాతం వాటా ఉన్నది. పశ్చిమ బెంగాల్‌లో మద్యం పంపిణీ చేయడానికి అమెజాన్ క్లియరెన్స్ పొందిందని జూన్‌లో ఒక నివేదిక నివేదించింది. 90 మిలియన్లకు పైగా జనాభా కలిగిన పశ్చిమ బెంగాల్ భారతదేశంలో నాల్గవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం, ఒడిశా జనాభా 41 మిలియన్లకు పైగా ఉంది.

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మద్యం రిటైల్ నిషేధించాయి. కరోనా వైరస్ మహమ్మారి వల్ల భారతదేశంలో కిరాణ సరుకుల నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
 

click me!