ఫేస్‌బుక్ ఇండియా పాలసీ హెడ్ అంఖిదాస్ రాజీనామా..

By Sandra Ashok Kumar  |  First Published Oct 28, 2020, 12:56 PM IST

అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోని కొంతమంది నాయకులకు అనుకూలంగా  విద్వేష పూరిత ప్రసంగాల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఒక మీడియాలో నివేదించిన రెండు నెలల తరువాత రాజీనామా చేశారు.  ఈ మేరకు ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 


ఫేస్‌బుక్ ఇండియా పాలసీ చీఫ్ అంకి దాస్ తన పదవికి రాజీనామా చేశారు, అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోని కొంతమంది నాయకులకు అనుకూలంగా  విద్వేష పూరిత ప్రసంగాల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఒక మీడియాలో నివేదించిన రెండు నెలల తరువాత రాజీనామా చేశారు.  

ఈ మేరకు ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత శుక్రవారం వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును అధ్యయనం చేస్తున్న ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన అంకి దాస్‌కు మంగళవారం కార్యాలయంలో చివరి రోజు.

Latest Videos

ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ “ఫేస్‌బుక్‌లో అంకి దాస్ పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది.

also read మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో ఇండియా డౌన్.. పాకిస్తాన్, నేపాల్ టాప్.. ...

ఆమె గత రెండు సంవత్సరాలుగా నా టీమ్ లో ఒక భాగంగా ఉంది, ఆమె తన పదవిలో ఎనలేని కృషి చేసింది. 2011లో అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజంలో చేరిన తొలివారిలో అంకి దాస్ ఒకరు.

ఇండియాలో మొదటి ఉద్యోగి అయిన అంఖి దాదాపు 9 సంవత్సరాల పాటు భారత, సౌత్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల వృద్ధిలో కీలక పాత్ర పోషించారని, ఈ సందర్భంగా ఆమె చేసిన సేవకు కృతజ్ఞతలు  తెలిపారు..

బీజేపీ నేతల ప్రసంగాలను ఫేస్ బుక్ చూసీ చూడనట్టు వదిలేస్తోందని గతనె ఆగస్టులో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. దీనిపై కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 

భారతదేశం, దక్షిణ అలాగే మధ్య ఆసియా ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా ఉన్న అంకి దాస్ ఉన్నారు. అయితే ఆమె రాజీనామాకు, ఈ వివాదానికి సంబంధం లేదని, అంఖిదాస్ ప్రజాసేవ  చేయాలనే ఉద్దేశంతో తనకు తానే స్వయంగా ఈ పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని అజిత్ మోహన్ స్పష్టం చేశారు.

బీజేపీకి అనుకూలంగా ఆపార్టీ నేతల ద్వేష పూరిత ప్రసంగాల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో అంఖిదాస్ వివాదంలో పడిన సంగతి తెలిసిందే. 

click me!