ఓక్లా మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలలో ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్ ఇండెక్స్‌లో 70వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విభాగంలో గత నెలతో పోలిస్తే ఇండియా రెండు ర్యాంకుల కిందకి పడిపోయింది.
ఓక్లా మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలలో ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్ ఇండెక్స్‌లో 70వ స్థానంలో ఉంది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విభాగంలో గత నెలతో పోలిస్తే ఇండియా రెండు ర్యాంకుల కిందకి పడిపోయింది, ఇండియాలో ఇంటర్నెట్ ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 12.07ఎంబిపిఎస్ గా నమోదైంది.
ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఫ్రంట్‌లో ఇండియా ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 46.47ఎంబిపిఎస్ తో 70వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఇంటర్నెట్, ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ రెండిటిలో భారతదేశ ఇంటర్నెట్ స్పీడ్ ప్రపంచ ఆవరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ కంటే చాలా తక్కువగా ఉంది, ఇతర దేశాలైన నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విభాగంలో ఇండియా కంటే ముందంజలో ఉన్నాయి.
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్
ఓక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ సెప్టెంబర్ 2020 ప్రకారం భారతదేశ ఇంటర్నెట్ ఆవరేజ్ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ 12.07ఎంబిపిఎస్. ఇది ప్రపంచ ఆవరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 35.26ఎంబిపిఎస్ కంటే చాలా తక్కువ. ఆగస్టు గణాంకాలతో పోల్చితే ఇండియా రెండు ర్యాంకులు కిందకు పడిపోయింది.
also read
మొత్తం 138 ప్రపంచదేశాలలో ఇండియా 131వ స్థానంలో ఉంది. భారతదేశ ఆవరేజ్ మొబైల్ ఇంటర్నెట్ అప్‌లోడ్ స్పీడ్ 4.31ఎంబిపిఎస్. మొబైల్ అప్‌లోడ్ స్పీడ్ ప్రపంచ ఆవరేజ్ 11.22ఎంబిపిఎస్. ఈ జాబితాలో భారతదేశం కంటే పొరుగు దేశాలు చైనా, శ్రీలంక, నేపాల్ ముందంజలో ఉన్నాయి.
113.35ఎంబిపిఎస్ ఆవరేజ్ మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ తో చైనా రెండవ స్థానంలో ఉంది, శ్రీలంక 19.95ఎంబిపిఎస్ తో 102వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 17.6ఎంబిపిఎస్ తో 116వ ర్యాంకుతో, 17.12ఎంబిపిఎస్ తో నేపాల్ 117వ స్థానంలో ఉంది.
బంగ్లాదేశ్ 10.76ఎంబిపిఎస్ తో ఆవరేజ్ మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ తో ఇండియా కంటే వెనుకంజలో 133వ స్థానంలో ఉంది.
ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్
ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ విషయానికి వస్తే 175 దేశాలలో భారతదేశం 70వ స్థానంలో ఉంది. ఇది భారతదేశ పొరుగు దేశాల కంటే చాలా ఎక్కువ, ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 46.47ఎంబిపిఎస్.
138.66ఎంబిపిఎస్ తో చైనా 20వ స్థానంలో, 31.42ఎంబిపిఎస్ తో శ్రీలంక 94వ స్థానంలో, 29.85Mbps తో బంగ్లాదేశ్ 98వ స్థానంలో, 22.36ఎంబిపిఎస్ తో నేపాల్ 113వ స్థానంలో, 10.10ఎంబిపిఎస్ తో పాకిస్తాన్ 159 వ స్థానంలో ఉంది.