ఫేస్‌బుక్‌ కొత్త డేటింగ్ సర్వీస్.. 32 దేశాలలో అందుబాటులోకీ..

By Sandra Ashok KumarFirst Published Oct 23, 2020, 12:22 PM IST
Highlights

 ఫేస్‌బుక్‌ ఒక కొత్త డేటింగ్ సర్వీస్ లాంచ్ చేసింది. ఐర్లాండ్  డేటా ప్రొటెక్షన్ కమిషనర్ (డిపిసి) ఆందోళన చేయడంతో ఫేస్‌బుక్ డేటింగ్ రోల్ అవుట్ ఫిబ్రవరిలో వాయిదా పడింది. రెగ్యులేటరీ ఆందోళనల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో రోల్ అవుట్ ఆలస్యం అయిన తరువాత 32 యూరోపియన్ దేశాలలో డేటింగ్ సర్వీసెస్ ప్రారంభిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ బుధవారం తెలిపింది. 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఒక కొత్త డేటింగ్ సర్వీస్ లాంచ్ చేసింది. ఐర్లాండ్  డేటా ప్రొటెక్షన్ కమిషనర్ (డిపిసి) ఆందోళన చేయడంతో ఫేస్‌బుక్ డేటింగ్ రోల్ అవుట్ ఫిబ్రవరిలో వాయిదా పడింది.

రెగ్యులేటరీ ఆందోళనల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో రోల్ అవుట్ ఆలస్యం అయిన తరువాత 32 యూరోపియన్ దేశాలలో డేటింగ్ సర్వీసెస్ ప్రారంభిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ బుధవారం తెలిపింది.

ఫేస్‌బుక్‌తో సహా ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థలకు యూరోపియన్ యూనియన్‌లోని ప్రధాన రెగ్యులేటర్ ఐర్లాండ్‌కు చెందిన డేటా ప్రొటెక్షన్ కమిషనర్ (డిపిసి) ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థ ఫిబ్రవరిలో యూరప్‌ దేశాలలో ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీస్ ప్రారంభాన్ని వాయిదా వేసింది.  

also read 

ఫేస్‌బుక్‌తో చేపట్టిన డేటా ప్రొటెక్షన్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ లేదా నిర్ణయాత్మక ప్రక్రియలకు సంబంధించి డాక్యుమెంటేషన్ ఇవ్వలేదని తెలిపింది. ఫేస్‌బుక్ యాప్‌లోని డేడికేటెడ్, ఆప్ట్-ఇన్ స్పేస్ అయిన ఫేస్‌బుక్ డేటింగ్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో ప్రారంభించారు. ఇది ప్రస్తుతం 20 ఇతర దేశాలలో అందుబాటులో ఉంది.

బుధవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఫేస్‌బుక్ డేటింగ్ ప్రొడక్ట్ మేనేజర్ కేట్ ఓర్సేత్ మాట్లాడుతూ వినియోగదారులు డేటింగ్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు  అలాగే  వారి ఫేస్‌బుక్ అక్కౌంట్ డిలెట్ చేయకుండా డేటింగ్ ప్రొఫైల్‌ను ఎప్పుడైనా తొలగించవచ్చు.

వారి డేటింగ్ ప్రొఫైల్‌లలోని వినియోగదారుల పేర్లు, వయస్సు వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ల నుండి తీసుకోబడతాయి అలాగే డేటింగ్ సర్వీస్ లో  పేర్లను ఎడిట్ చేయడానికి ఉండదు, వినియోగదారుల చివరి పేర్లు ప్రదర్శించవని, వారి ప్రొఫైల్‌ సమాచారం ఇతర వ్యక్తులతో షేర్ చేయాలా వద్దా అని వారు సెలెక్ట్ చేసుకోవచ్చని అన్నారు. 

click me!