తెలుగు వారికోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్...షాపింగ్ ఇక మరింత సులభంగా...

By Sandra Ashok Kumar  |  First Published Jun 24, 2020, 6:11 PM IST

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ గత ఏడాది సెప్టెంబర్‌లో హిందీ భాషను ప్రవేశపెట్టిన తొమ్మిది నెలల తర్వాత తాజాగా ఇప్పుడు మరో మూడు భాషలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ఫ్లిప్ కార్ట్ మరింత చేరువకానుంది.


ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కన్నడ, తమిళం, తెలుగు భాషలలో కూడా షాపింగ్ చేయవచ్చని తెలిపింది. ఒక విధంగా ఇదీ ఆ రాష్ట్ర ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని సంస్థ  ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ గత ఏడాది సెప్టెంబర్‌లో హిందీ భాషను ప్రవేశపెట్టిన తొమ్మిది నెలల తర్వాత తాజాగా ఇప్పుడు మరో మూడు భాషలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Latest Videos

undefined

దీని ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ఫ్లిప్ కార్ట్ మరింత చేరువకానుంది. కన్నడ, తమిళం, తెలుగు భాషలలోని 54 లక్షలకు పైగా పదాలను కొత్తగా చేర్చినటు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇందులో ఉత్పత్తి వివరాలతో పాటు బ్యానర్లు, పేమెంట్ పేజీలను అనువదించినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

దీని వల్ల దేశంలోని చిన్న, చిన్న పట్టణాలు, నగరాలను లక్ష్యంగా చేసుకుని వారికి మరింత సులభంగా వారి భాషలో షాపింగ్ చేయడానికి సహాయపడుతుంది. హిందీని ఎంచుకున్న 95 శాతం మంది వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారని  కంపెనీ తెలిపింది.

also read 

హిందీ భాషలలో సేవలందించడం ద్వారా వినియోగదారులు సంతృప్తికరంగా ఉన్నారని, కాకపోతే హిందీ భాషాను ఉపయోగిస్తున్న మొత్తం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల వివరాల గురించి వెల్లడించలేదు.

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ భాషలలో సేవలందించనున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భాషలలో సేవలందించే ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం, మైసూర్‌లలో భాషలకు సంబంధించిన పదాలను అధ్యయనం చేశామని తెలిపింది.

ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్‌ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది. అయితే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలలో సేవలను విస్తరించడం వల్ల వినియోగదారులకు సంస్థ మరింత చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. 

click me!