కొత్తగా లాంచ్ చేసిన ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 29 నుండి యు.ఎస్‌లో డెలివరీలు ప్రారంభించనుంది.భారతదేశంలో బోస్ కొత్త ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల లాంచ్ లేదా ధర పై ఎటువంటి సమాచారం లేదు
అమెరికన్ ఆడియో డివైజెస్ తయారీ సంస్థ బోస్ రెండు కొత్త ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసింది. సుమారు రూ. 20,500 ధరతో బోస్ క్వైట్ కంఫర్ట్ ఇయర్బడ్స్‌ను ప్రారంభించింది. కొత్తగా లాంచ్ చేసిన ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
సెప్టెంబర్ 29 నుండి యు.ఎస్‌లో డెలివరీలు ప్రారంభించనుంది.భారతదేశంలో బోస్ కొత్త ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల లాంచ్ లేదా ధర పై ఎటువంటి సమాచారం లేదు, అయితే రాబోయే వారాల్లో భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
undefined
బోస్ క్వైట్ కంఫర్ట్ ఇయర్‌బడ్స్ ఫీచర్స్
బోస్ క్వైట్ కాంఫర్ట్ ఇయర్‌బడ్స్ ఆక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తో వస్తుంది. ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు 2019లో ప్రకటించిన బోస్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్‌బడ్స్ 700 అని కూడా పిలుస్తారు. ఈ ఇయర్‌బడ్స్ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోకు పోటీగా లాంచ్ చేశారు. ఇయర్‌ఫోన్‌లు యుఎస్‌బి టైప్-సి, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
also read
కనెక్టివిటీ కోసం ఎస్‌బిసి, ఏఏసి బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్ తో బోస్ క్వైట్ కంఫర్ట్ ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 5.1తో వస్తుంది. బోస్ మ్యూజిక్ యాప్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఇయర్‌ఫోన్‌లలోని వివిధ ఫీచర్లు, సెట్టింగ్‌లను మార్చుకోవడానికి యాప్ సహాయపడతాయి.
బోస్ స్పోర్ట్ ఇయర్‌బడ్స్ ఫీచర్స్
బోస్ ప్రారంభించిన రెండవ ట్రు వైర్‌లెస్ స్పోర్ట్ హెడ్‌సెట్ ఇయర్‌బడ్స్ ఇది. కొత్త బోస్ స్పోర్ట్ ఇయర్‌బడ్‌లు వాటర్ రెసిస్టంట్ ఐపిఎక్స్ 4తో సురక్షితమైన, సౌకర్యవంతమైనవిగా ఉంటాయి. వ్యాయామం, ఇతర సమయంలో చాలా ఉపయోగంగా ఉంటుంది.
క్వైట్ కంఫర్ట్ ఇయర్‌బడ్స్ లాగానే స్పోర్ట్ ఇయర్‌బడ్స్ లో యూఎస్‌బి టైప్-సి, క్యూఐ వైర్ లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. కనెక్టివిటీలో ఎస్‌బిసి, ఏఏసి బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్ తో బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఇయర్‌ఫోన్‌లలో ఐదు గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని హామీ ఇచ్చారు.