ఆన్ లైన్ పేమెంట్ యాప్‌లకు షాక్‌.. ఆ ఎనిమిది యాప్‌లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ..

By S Ashok KumarFirst Published Jan 6, 2021, 11:38 AM IST
Highlights

చైనా రాజధాని బీజింగ్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం చైనా సాఫ్ట్‌వేర్ తో పనిచేసే ఎనిమిది పేమెంట్ యాప్స్ ని  నిషేధిస్తు ఉత్తర్వులపై సంతకం చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి మరో రెండు వారాల మాత్రమే ఉంది. చైనా రాజధాని బీజింగ్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం చైనా సాఫ్ట్‌వేర్ తో పనిచేసే ఎనిమిది పేమెంట్ యాప్స్ ని  నిషేధిస్తు ఉత్తర్వులపై సంతకం చేశారు.

ఈ విషయాన్ని మొదట ఒక ఆంగ్ల పత్రిక నివేదించింది. అమెరికన్లకు చైనీస్ సాఫ్ట్‌వేర్ యాప్స్ వల్ల ఎదురయ్యే ముప్పును అరికట్టే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంది, వీటి ద్వారా యూజర్ డాటా బేస్‌లు, సున్నితమైన డేటాకు అక్సెస్ ఉంది. జాతీయ భద్రతను పరిరక్షించడానికి చైనా సాఫ్ట్‌వేర్ యాప్ ల డెవలపర్‌లపై యునైటెడ్ స్టేట్స్ ఈ చర్య తీసుకోవాలని ఆర్డర్ వెల్లడించింది.

నిషేధం విధించిన జాబితాలో అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ గ్రూప్‌నకు చెందిన అలీ పే, టెన్సెంట్‌కు చెందిన విచాట్‌ పే ఉన్నాయి. ఈ ఆర్డర్‌లో కామ్‌స్కానర్, షేర్‌ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, విమేట్, డబ్ల్యుపిఎస్ ఆఫీస్ పేర్లు కూడా ఉన్నాయి.

ఈ నిషేధం పై యుఎస్ టెన్సెంట్ ప్రతినిధి, వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం స్పందించలేదు. "స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వంటి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను యాక్సెస్ చేయడం ద్వారా, చైనాకి కనెక్ట్ చేయబడిన సాఫ్ట్‌వేర్ యాప్స్ వినియోగదారుల నుండి సున్నితమైన వ్యక్తిగతం సమాచారం, ప్రైవేట్ సమాచారంతో సహా వినియోగదారుల నుండి చాలా అధిక సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు" అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో పేర్కొంది.

also read 

ఇటువంటి డేటా సేకరణ "ఫెడరల్ ఉద్యోగులు, ఇతరులను  ట్రాక్ చేయడానికి వారి వ్యక్తిగత సమాచార పత్రాలను రూపొందించడానికి చైనాను అనుమతిస్తుంది" అని తెలిపింది.  

ఈ ఉత్తర్వు ప్రకారం 45 రోజుల కాలపరిమితి ఉన్నప్పటికీ, నిషేధిత లావాదేవీలను గుర్తించడానికి వాణిజ్య విభాగం జనవరి 20 లోపు పనిచేయాలని యోచిస్తున్నట్లు మరో అమెరికా అధికారి తెలిపారు.

చైనా వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ ఒక ప్రకటనలో "చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న బెదిరింపుల నుండి అమెరికన్ల గోప్యత, భద్రతను పరిరక్షించాలనే ట్రంప్ నిబద్ధతకు" మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

యంట్ మొబైల్ అనేది ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ. మొబైల్ యాప్ ద్వారా రుణాలు, చెల్లింపులు, భీమా, ఆస్తి నిర్వహణ సేవలను అందిస్తుంది. ఇది 33% అలీబాబా యాజమాన్యంలో ఉంది, కాని ప్రస్తుతం ఇది అమెరికన్ వినియోగదారులకు అందుబాటులో లేదు.

చైనా అగ్ర చిప్ మేకర్ SMIC, చమురు కంపెనీ దిగ్గజం CNOOC తో సహా చైనా సైనిక సంస్థలపై అమెరికా పెట్టుబడులను నిషేధిస్తూ వైట్ హౌస్ నవంబర్ లో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసింది. గత నెలలో వాణిజ్య విభాగం చైనా డ్రోన్ తయారీ సంస్థ SZ DJI టెక్నాలజీ కో లిమిటెడ్‌తో సహా డజన్ల కొద్దీ చైనా కంపెనీలను వాణిజ్య బ్లాక్లిస్ట్‌లో చేర్చింది.
 

click me!