జనవరి 11న ఇండియన్ మార్కెట్లోకి వన్‌ప్లస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..

By S Ashok Kumar  |  First Published Jan 5, 2021, 7:07 PM IST

వన్‌ప్లస్ నుండి ఫిట్‌నెస్ బ్యాండ్ పుకార్లు గత నెల చివరి నుండి వైరల్ అవుతున్నాయి. ఈ బ్యాండ్ కొత్త సంవత్సరం మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని భావించారు. కానీ కంపెనీ ఇంకా అధికారిక లాంచ్ తేదీని తేలపనప్పటికీ, ఈ నెలలోనే వన్‌ప్లస్ బ్యాండ్  లాంచ్ కానున్నట్లు తేలుస్తోంది.


చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా వ్రిస్ట్ బ్యాండ్ (అధికారికంగా పేరుగా ఇంకా ధృవీకరించలేదు)టీజర్ ను ట్విట్టర్ ద్వారా అధికారికంగా షేర్ చేసింది. వన్‌ప్లస్ నుండి ఫిట్‌నెస్ బ్యాండ్ పుకార్లు గత నెల చివరి నుండి వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యాండ్ కొత్త సంవత్సరం మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని భావించారు. కానీ కంపెనీ ఇంకా అధికారిక లాంచ్ తేదీని తేలపనప్పటికీ, ఈ నెలలోనే వన్‌ప్లస్ బ్యాండ్  లాంచ్ కానున్నట్లు తేలుస్తోంది. వన్‌ప్లస్ బ్యాండ్ జనవరి 11న లాంచ్ అవుతుందని దీని గురించి తెలిసిన ఇద్దరు టిప్‌స్టర్‌లు పేర్కొన్నారు. దీని ధర, ఫీచర్స్ గురించి కూడా వెల్లడించారు.

Latest Videos

undefined

వన్‌ప్లస్ ఇండియా ఈ వ్రిస్ట్ బ్యాండ్ పేరు లేదా ఫీచర్స్ తేలపకుండా ఫిట్‌నెస్ బ్యాండ్ టీజర్ ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోతో  ‘ది న్యూ ఫేస్ ఆఫ్ ఫిట్‌నెస్’,  ‘త్వరలో వస్తుంది’ అంటూ పోస్ట్ చేసింది.

ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ కోసం ప్రత్యేకమైన వెబ్‌పేజీ వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో ‘నోటిఫై మి’ ఆప్షన్‌తో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌ను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తు ‘పర్స్యూట్ ఆఫ్ ఫిట్‌నెస్’ అనే క్విజ్ లో పాల్గొనే వివరాలను వెల్లడించింది. క్విజ్ విజేతలను కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది.

also read 

భారతదేశంలో వన్‌ప్లస్ బ్యాండ్ ధర, ప్రారంభ తేదీ 
టిప్‌స్టర్‌లు ముకుల్ శర్మ, ఇషాన్ అగర్వాల్ వన్‌ప్లస్ బ్యాండ్ జనవరి 11న రూ. 2,499 ధరతో లాంచ్ కానున్నట్లు తెలిపారు. వన్‌ప్లస్ బ్యాండ్ కోసం అమెజాన్‌లో ‘నోటిఫై మి’ ఎంపికతో ఒక పేజీని కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ స్లీప్ డేటా అంటే స్లీప్ ట్రాకింగ్‌తో వస్తుందని సూచించారు.

టిప్‌స్టర్ ముకుల్ శర్మ వన్‌ప్లస్ బ్యాండ్ ఫోటోలను ట్విట్టర్‌లో బ్లాక్ దీర్ఘచతురస్రాకార డిస్ ప్లే, బూడిద రంగు పట్టీతో వస్తున్నాట్లు చూపించారు. ఇది బ్లాక్, నేవీ, టాన్జేరిన్ గ్రే అనే మూడు రంగులలో వస్తుంది.

వన్‌ప్లస్ బ్యాండ్ ఫీచర్స్ 
యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రకారం వన్‌ప్లస్ బ్యాండ్ 1.1-అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ ప్లే, 24x7 హార్ట్ బీట్ సెన్సార్ మానిటర్, SpO2 బ్లడ్ సాచురేషన్ మానిటరింగ్, 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ 5.0, ఐపి 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, మల్టీ ఎక్సైజ్ మోడ్ తో రాబోతుంది.

వన్‌ప్లస్ బ్యాండ్ కూడా 50 మీటర్ల వరకు  వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందని, 100 ఎంఏహెచ్ బ్యాటరీతో 14 రోజుల వరకు బ్యాక్ అప్ వస్తుందని చెబుతున్నారు. ఇది 40.4x17.6x11.45mm, 10.3 గ్రాముల బరువు, 13 ఎక్సైజ్ మోడ్స్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

 

This year, we are here to help you achieve all your fitness goals and make your life easier.

Head to the link to get notified: https://t.co/LUCWvulREa pic.twitter.com/ynLzgyFxku

— OnePlus India (@OnePlus_IN)
click me!