పొరపాటున కూడా ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేయవద్దు, లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది..

By S Ashok Kumar  |  First Published Jan 9, 2021, 4:58 PM IST

వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం, బ్యాంకులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికి  ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. 


కరోనా కాలంలో ఆన్ లైన్ పేమెంట్ తో పాటు ఆన్ లైన్ మోసాల కేసులు కూడా భారీగా పెరిగాయి. వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం, బ్యాంకులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికి  ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను కూడా జారీ చేశారు.

కానీ కొందరు మోసగాళ్ళు  వినియోగదారుల ఖాతాల నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి వివిధ కొత్త పద్దతులను ఉపయోగిస్తున్నారు. కొంతకాలంగా కస్టమర్ కేర్ కుంభకోణం భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులకు పెద్ద సమస్యగా మారింది, దీనివల్ల ప్రజలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.

Latest Videos

undefined

ఏదైనా ఒక సంస్థ కస్టమర్ కేర్ నంబర్‌ను కనుగొనడానికి వినియోగదారులు సాధారణంగా గూగుల్‌లో వెతుకుతుంటారు, గూగుల్ లో కనిపించిన నంబర్ సరైనది అనుకోని డయల్ చేస్తుంటారు. కానీ గూగుల్‌లో సేర్చ్ చేసిన కస్టమర్ కేర్ నంబర్లు చాలావరకు నకిలీవి ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ నంబర్‌కు కాల్ చేసిన కొద్దిసేపటికే, కస్టమర్ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు అదృశ్యమవుతుంది. 

also read 

అంతేకాకుండా రిమోట్ కంట్రోల్ యాప్స్ ద్వారా కూడా చేసే కస్టమర్ కేర్ మోసాలను అతిపెద్ద ఆయుధంగా పరిగణింస్తారు. ఇలాంటి మోసాలను చేయడానికి మొదట మొబైల్ వినియోగదారులను తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో రిమోట్ డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేయమని నకిలీ కస్టమర్ కేర్ నంబర్ దారులు బలవంతం చేస్తారు.

ఇందుకోసం మోసగాళ్ళు  ప్రజలకు మెసేజ్ ద్వారా ఒక లింక్‌ను పంపి రిమోట్ యాక్సెస్‌ కోసం  యాప్ డౌన్‌లోడ్ చేయమని  కోరుతారు. యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత వారి ఫోన్‌ అక్సెస్ మొత్తం మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్తుందని ప్రజలకు తెలియదు.

దీని తరువాత మోసగాళ్ళు ఫోన్‌లో స్క్రీన్ రికార్డింగ్‌ను ప్రారంభిస్తారు. స్క్రీన్ రికార్డింగ్‌ తో మీ ఫోన్ యాప్స్ కి అక్సెస్ ఇంకా మీ వ్యక్తిగత  సమాచారం కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓ‌టి‌పి పిన్ అన్నీ బహిర్గతం అవుతాయి.

ఇలాంటి మోసాలను నివారించడానికి ఈ కింది యాప్స్ డౌన్‌లోడ్ చేయవద్దు. 

 1.టీమ్‌ వ్యూయర్ క్విక్‌సపోర్ట్

2.మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్

3.యెని డెస్క్ రిమోట్ కంట్రోల్

4.ఎయిర్ డ్రోయిడ్ : రిమోట్ యాక్సెస్ అండ్ ఫైల్

5.ఎయిర్ మిర్రర్: రిమోట్ సపోర్ట్ అండ్ రిమోట్ కంట్రోల్ డివైజెస్ 

6.క్రోమ్ రిమోట్ డెస్క్‌టాప్

7.స్ప్లాష్‌టాప్ పర్సనల్ -రిమోట్ డెస్క్‌టాప్

బ్యాంక్ సమస్యలు, ఇతర లావాదేవీలకు లేదా మరేదైనా వివరాల కోసం అధికారిక ఫోన్ నంబర్లను తెలుసుకోవడం ఉత్తమం.

click me!