నా షార్ట్-వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్ 2020లో 540 మిలియన్ డాలర్ల లాభంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన యాప్‌గా అవతరించింది.
న్యూ ఢీల్లీ: భారతదేశంలో నిషేధం తరువాత చైనా షార్ట్-వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్ 2020లో 540 మిలియన్ డాలర్ల లాభంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన యాప్‌గా అవతరించింది, ఆ తర్వాత డేటింగ్ యాప్ టిండర్ 513 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
యాప్ అనలిటిక్స్ సంస్థ ఆప్టోపియా విడుదల చేసిన డేటా ప్రకారం యూట్యూబ్ 478 మిలియన్ డాలర్లు వసూలు చేసి మూడవ స్థానంలో ఉండగా డిస్నీ + 314 మిలియన్ డాలర్లు, టెన్సెంట్ వీడియో 2020లో 300 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది.
undefined
నెట్‌ఫ్లిక్స్ యాప్ ప్రపంచవ్యాప్తంగా 209 మిలియన్లు వసూలు చేసి 10వ స్థానంలో ఉంది. చైనా నుండి వచ్చిన డేటా మినహా అన్ని ఐఓఎస్, గూగుల్ ప్లే డేటాతో కలిపి ప్రకటించినట్లు యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా ఒక ప్రకటనలో పేర్కొంది.
also read
850 మిలియన్ల వద్ద టిక్‌టాక్ 2020లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా అవతరించింది, తరువాత వాట్సాప్ 600 మిలియన్లు, ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేశారు.
ఫేస్‌బుక్ ఫ్యామిలీలోని ఇన్‌స్టాగ్రామ్ 503 మిలియన్ డౌన్‌లోడ్‌లతో నాల్గవ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న 2020 సంవత్సరంలో 477 మిలియన్ డౌన్‌లోడ్‌లతో జూమ్ ఐదవ స్థానంలో నిలిచింది.
టాప్ 10 జాబితాలో 404 మిలియన్ డౌన్‌లోడ్లతో ఫేస్‌బుక్ మెసెంజర్ ఆరో స్థానంలో ఉంది. "ప్రపంచ జాబితాలోని చివరి మూడు యాప్స్ 2020 రెండవ భాగంలో ఎక్కువ డౌన్‌లోడ్‌లు పొందాయి. ఎంఎక్స్ తకాటాక్, జోష్ వీడియో, మోజ్ కూడా భారతదేశంలో పాపులర్ పొందిన సోషల్ షార్ట్ వీడియో యాప్స్”అని కంపెనీ తెలిపింది.