చైనా యాప్స్ నిషేధం.. వెలుగులోకి మరో ఆశ్చర్యకరమైన విషయం..

By Sandra Ashok KumarFirst Published Sep 19, 2020, 4:08 PM IST
Highlights

ఒక వైపు భారత ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధిస్తుండగా ఆశ్చర్యకరమైన విషయం తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం రాజ్యసభలో ఒక ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది, దీని ప్రకారం ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఉపయోగించే మొబైల్ నెట్‌వర్క్ పరికరాల్లో 50 శాతానికి పైగా చైనా కంపెనీలకు చెందినవి అని తెలిపింది.

ఇండియా-చైనా సరిహద్దు వివాదం తరువాత భారత ప్రభుత్వం చైనా వైఖరి పట్ల గట్టి నిర్ణయం తీసుకుంది. గత నెలలో అనేక చైనా యాప్‌లను కూడా నిషేధించిన సంగతి మీకు  తెలిసిందే. ఒక వైపు భారత ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధిస్తుండగా ఆశ్చర్యకరమైన విషయం తెరపైకి వచ్చింది.

ఇటీవల ప్రభుత్వం రాజ్యసభలో ఒక ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది, దీని ప్రకారం ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఉపయోగించే మొబైల్ నెట్‌వర్క్ పరికరాల్లో 50 శాతానికి పైగా చైనా కంపెనీలకు చెందినవి అని తెలిపింది.

మరో పక్క ఎం‌టి‌ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్‌లోని 10 శాతం పరికరాలు చైనా కంపెనీవి‌. ఈ సమాచారాన్ని రాజ్యసభలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సంజయ్ ధోత్రే (సంజయ్ ధోత్రే) ఇచ్చారు, బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్‌వర్క్‌లో 44.4 శాతం జెడ్‌టిఇ, 9.0 శాతం హువావే కంపెనీకి చెందిన  పరికరాలు ఉన్నాయన్నారు.

also read టిక్‌టాక్, విచాట్ డౌన్‌లోడ్‌పై బ్యాన్.. ఆదివారం నుంచి అమలు.. ...

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్) ప్రస్తుతం 2జి, 3జి నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నాయి. కొన్ని నెలల క్రితం లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో చైనా దళాలతో జరిగిన వాగ్వివాదంలో 20 మంది భారతీయ సైనికులు మరణించారని గుర్తుచేశారు.

ఈ సంఘటన తరువాత భారతదేశంలోని చైనా కంపెనీల టెండర్లు, ఇతర ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ టెలికం కంపెనీలలో ఉన్న పరికరాల శాతం ఎక్కువగా చైనా కంపెనీలకు చెందినది.

ఇక ప్రైవేట్ టెలికాం సంస్థల గురించి రాజ్యసభలో సంజయ్ ధోత్రే మాట్లాడుతూ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మొబైల్ నెట్‌వర్క్‌లో జెడ్‌టిఇ, హువావేల టెలికాం పరికరాలు లేవు అని  చెప్పారు. ఎయిర్ టెల్, వి (వోడాఫోన్ ఐడియా) గురించి సమాచారం ఇస్తూ, ఈ కంపెనీలు చాలా మంది విక్రేతల నుండి కొనుగోలు చేసిన పరికరాలను ఉపయోగిస్తాయని చెప్పారు.

click me!